లాంబోర్గినీ హారికేన్: ఫొటోలు, వివరాలు, స్పెసిఫికేషన్స్

By Sriram Hebbar

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ ఇటీవలే ఉత్పత్తిని నిలిపివేసిన తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు ఓ సరికొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ మోడల్‌కు హారికేన్ అనే పేరును పెట్టారని తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. లాంబోర్గినీ హారికేన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోలు, వివరాలు వెల్లడయ్యాయి.

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 సూపర్ కారుకు సంబంధించిన అఫీషియల్, వివరాలు, స్పెసిఫికేషన్లను ఈ క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి. చివరి స్లైడ్‌లో లాంబోర్గినీ హారికేన్ వీడియోని వీక్షించడం, అందులో దాని ఇంజన్ సౌండ్‌ను వినటం మాత్రం మర్చిపోకండి..!

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

గల్లార్డోకి సక్సెసర్‌గా వస్తున్న ఈ సూపర్ కారు పేరు లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4. ఈ కారుకు ఆ పేరును 1879 కాలానికి చెందిన స్పానిష్ ఫైటింగ్ బుల్ నుంచి స్ఫూర్తి పొంది పెట్టడం జరిగింది.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 పేరులో ఎల్‌పి అంటే, 'లాంగిట్యూడినేల్ పోస్టెరీయోర్'. ఇది ఇంజన్ ఓరియంటేషన్‌ను ప్రతిభింభింపజేస్తుంది. ఇందులో 610 అంటే ఇంజన్ నుంచి వెలవడే శక్తి (పిఎస్‌లలో), 4 అంటే ఫోర్ వీల్ డ్రైవ్ అని అర్థం.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

ఈ పవర్‌ఫుల్ ఇంజన్ లాంబోర్గినీ డోపియా ఫ్రిజియోన్ (ఎల్‌డిఎఫ్) సెవన్-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆప్షనల్ లాంబోర్గినీ డైనమిక్ స్టీరింగ్, మ్యాగ్నెటో-రియోలాజికల్ డ్యాంపర్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినవి.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

లాంబోర్గినీ హారికేన్‌లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి - స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. దీని పెర్ఫామెన్స్ వివరాలు ఉన్నాయి:

* 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగం

* 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగం

* గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లు.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

గల్లార్డో ట్రాక్ వెర్షన్ అయిన 'సెస్టో ఎలిమెంటో' (కేవలం రేస్ ట్రాక్‌ల కోసం మాత్రమే తయారు చేయబడినది) నుంచి స్ఫూర్తి పొంది లాంబోర్గినీ హారికేన్‌ను తయారు చేశారు. అవెంటేడర్‌లోని కొన్ని డిజైన్ ఎలిమెంట్లను కూడా ఇందులో కూడా గమనించవచ్చు.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

లాంబోర్గినీ హారికేన్ తయారీలో ఎక్కువ భాగం కార్బన్ ఛాస్సిస్‌ను ఉపయోగించడం వలన ఇది లీటరుకు 8 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఇది కిలోమీటరుకు 290 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ వ్యర్థాలను విడుదల చేస్తుంది. ఈయూ6 కాలుష్య నిబంధనలను పాటించే ఈ ఇంజన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభిస్తుంది.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

లాంబోర్గినీ హారికేన్ సూపర్ కారులో 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను జోడించారు. నప్పా లెథర్, ఆల్కాంట్రాలతో దీని అప్‌హెలెస్ట్రీ, ఇంటీరియర్స్‌ను డిజైన్ చేశారు.

లాంబోర్గినీ హారికేన్ ఫస్ట్ లుక్..

వచ్చే ఏడాది మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో లాంబోర్గినీ హారికేన్‌ను తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. ఆ తర్వాత ఇది వాణిజ్య పరంగా మార్కెట్లోకి వచ్చే ఆస్కారం ఉంది.

ఈలోపుగా లాంబోర్గినీ హారికేన్ ఇంజన్ సౌండ్‌ను చూపించే ఈ వీడియోను వీక్షించండి.

Most Read Articles

English summary
Lamborghini has officially revealed the Huracan since this story was publshed and additional details have been added. You can skip to the slider below for details, images and a video.
Story first published: Friday, December 20, 2013, 16:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X