భారత పొలాల్లోకి ప్రవేశించనున్న లాంబోర్గినీ ట్రాక్టర్లు

By Ravi

ఇటలీకు చెందిన ప్రముఖ సూపర్ కార్ల తయారీ సంస్థ లాంబోర్గినీ తమ 'సూపర్ ట్రాక్టర్ల'ను ఇండియాలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి లాంబోర్గినీ సూపర్‌కార్ల తయారీ కన్నా ముందుగా ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేది. అయితే, లాంబోర్గినీ సూపర్‌కార్లు మంచి ప్రాచుర్యాన్ని సంపాధించుకోవటంతో, ట్రాక్టర్ల వ్యాపారం సేమ్ డచ్-ఫార్ (ఎస్‌డిఎఫ్) (SAME Deutz-Fahr) గ్రూపులో భాగమైంది.

ఓ ప్రముఖ ఆంగ్లపత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్‌డిఎఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ భాను శర్మ మాట్లాడుతూ.. తాము భారత మార్కెట్‌ను అధ్యయనం చేస్తున్నామని, మరో ఏడాది కాలంలో లాంబోర్గినీ ట్రాక్టర్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతానికి ఏయే మోడళ్లను ప్రవేశపెట్టాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ధర విషయానికి వస్తే ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవని ఆయన అన్నారు.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఎస్‌డిఎఫ్ ఇండియా తమిళనాడులో ఉన్న రాణిపేట్ ఉత్పత్తి కేంద్రంలో లాంబోర్గినీ ట్రాక్టర్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గడచిన సంవత్సరంలో ఎస్‌డిఎఫ్ గ్రూప్ భారత్‌లో నిర్మించిన 6,000 ట్రాక్టర్లలో 800 ట్రాక్టర్ల లాంబోర్గినీ లోగోతో రూపొందించామని ఆయన చెప్పారు. ఈ ట్రాక్టర్లను యూరప్, మలేషియా దేశాలకు కంపెనీ ఎగుమతి చేస్తోంది. ఈ ట్రాక్టర్లలో ఎక్కువ భాగం స్థానికంగా లభించే విడిభాగాలను ఉపయోగించినట్లు శర్మ చెప్పారు.

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

లాంబోర్గినీ ట్రాక్టర్

Most Read Articles

English summary
Supercar brand Lamborghini tractors may hit to Indian shores soon. Come 2014, Lamborghini tractors, known for their advanced technology and styling, maybe working farms in India.
Story first published: Friday, April 19, 2013, 17:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X