భారత్‌లో ల్యాండ్ రోవర్ ఫ్రీల్యాండర్ ఎస్ బిజినెస్ ఎడిషన్ విడుదల

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ ల్యాండ్ రోవర్ నుంచి భారత మార్కెట్లో అత్యంత సరమైన ధరకే లభ్యమవుతున్న ఫ్రీల్యాండర్ లగ్జరీ ఎస్‌యూవీలో మరొక చవక వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది.

లగ్జరీ కార్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు గాను ఫ్రీల్యాండర్‌ ఎస్‌యూవీలో 'ఫ్రీల్యాండర్ ఎస్ బిజినెస్ ఎడిషన్' పేరిట తక్కువ ధర కలిగిన ఓ కొత్త వేరియంట్‌ను ల్యాండ్ రోవర్ విడుదల చేసింది. ఈ ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లో విడుదలైన ఫ్రీల్యాండర్ ఇప్పుడు మొత్తం 3 వేరియంట్లలో లభ్యమవుతుంది. వాటి వివరాలు, ధరలు ఇలా ఉన్నాయి:

  • ఫ్రీల్యాండర్ ఎస్ఈ - రూ.39.19 లక్షలు
  • ఫ్రీల్యాండర్ హెచ్ఎస్ఈ - రూ.42.42 లక్షలు
  • ఫ్రీల్యాండర్ ఎస్ - రూ.37.11లక్షలు (బిజినెస్ ఎడిషన్)

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)


జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా తమ క్యూ3 (రెగ్యులర్ వెర్షన్), క్యూ3 ఎస్ (చవక వేరియంట్) విషయంలో ఏవిధమైన విధానాన్ని అనుసరించిందో ల్యాండ్ రోవర్ కూడా అదే విధానాన్ని అనుసరించి, ఫ్రీల్యాండర్ ఎస్ వేరియంట్ ధరను తక్కుగా ఉంచుంది. ఫ్రీల్యాండర్ ఎస్ బిజినెస్ ఎడిషన్ వేరియంట్లో పానరోమిక్ సన్‌రూఫ్, రివర్స్ కెమెరా, మెరీడియన్ మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, ప్రీమియం ఎక్స్టీరియర్ పెయింట్ వంటి ఫీచర్లు లేవు.

అలాగే, ఇందులోని ఇంజన్‌ను కూడా రీట్యూన్ చేశారు. ఫ్రీల్యాండర్ ఎస్‌ బిజినెస్ ఎడిషన్‌లో ఉపయోగించిన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 147 హార్స్ పవర్‌ను (టాప్ ఎండ్ వేరియంట్ 188 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది), 420 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కమాండ్‌షిఫ్ట్‌తో కూడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

Land Rover Freelander S

ఫ్రీల్యాండర్ ఎస్‌ బిజినెస్ ఎడిషన్‌, ల్యాండ్ రోవర్ యొక్క టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో కూడిన ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది 11.2 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది లీటరుకు 12.39 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇది చవక వేరియంట్ అయినప్పటికీ, సేఫ్టీ విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, రోల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.
Most Read Articles

English summary
Land Rover Freelander, the most affordable Land Rover offered in India is now less expensive by the way of a new low cost trim. The new variant is for some reason, named Freelander S Business Edition, though it offers nothing remotely corporate.
Story first published: Tuesday, August 20, 2013, 11:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X