సన్నీ కన్నా ముందుగానే స్కాలాలో ఆటోమేటిక్ వేరియంట్

By Ravi

భారత మార్కెట్లో రెనో ఇండియా అందిస్తున్న స్కాలా సెడాన్ ఇప్పుడు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభ్యం కానుంది. నిస్సాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన రెనో స్కాలాలో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను అతి త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది.కేవలం పెట్రోల్ వెర్షన్‌లో (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌జెడ్) మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది. దీని ధర సాధారణ పెట్రోల్ వేరియంట్లతో పోల్చుకుంటే సుమారు రూ.80,000 వరకూ అదనంగా ఉండొచ్చని అంచనా.

కొత్త రెనో స్కాలా సెడాన్ సివిటి గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది, దీంతో ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సి-సెగ్మెంట్ సెడాన్‌గా నిలువనుంది. సివిటి గేర్‌బాక్స్‌ సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులోని అధిక గేర్ రేషియోల సంఖ్య కారణంగా కారు జర్క్‌లు ఇవ్వకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది. మరోవైపు రెనో భాగస్వామి నిస్సాన్ సివిటి శ్రేణికి చెందిన ఎక్స్-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను అభివృద్ధి చేస్తోంది. అధిక మైలేజ్‌కు ఎక్స్-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లు పెట్టింది పేరు.

కాగా.. పాపులర్ నిస్సాన్ సన్నీ సెడాన్ కన్నా ముందుగానే రెనో స్కాలా సెడాన్‌లో ఆటోమేటిక్ వేరియంట్ విడుదల కావటం విశేషం. రెనో స్కాలా పెట్రోల్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ 1.5 లీటర్ ఎక్స్‌హెచ్2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే స్కాలా లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ దీని కన్నా కాస్తంత తక్కువగా ఉండనుంది.

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

నిస్సాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేసిన రెనో స్కాలాలో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను అతి త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది.కేవలం పెట్రోల్ వెర్షన్‌లో (ఆర్ఎక్స్ఎల్, ఆర్ఎక్స్‌జెడ్) మాత్రమే ఆటోమేటిక్ వేరియంట్‌ అందుబాటులో ఉంటుంది.

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

కొత్త రెనో స్కాలా సెడాన్ సివిటి గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది, దీంతో ఇది ఇండియాలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సి-సెగ్మెంట్ సెడాన్‌గా నిలువనుంది. సివిటి గేర్‌బాక్స్‌ సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులోని అధిక గేర్ రేషియోల సంఖ్య కారణంగా కారు జర్క్‌లు ఇవ్వకుండా సాఫీగా ముందుకు సాగిపోతుంది.

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా పెట్రోల్ వెర్షన్‌లో పవర్‌ఫుల్ 1.5 లీటర్ ఎక్స్‌హెచ్2 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభించే స్కాలా లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం). ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ దీని కన్నా కాస్తంత తక్కువగా ఉండనుంది.

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

సాధారణ పెట్రోల్ వేరియంట్లతో పోల్చుకుంటే ఆటోమేటిక్ వేరియంట్‌ స్కాలా ధర సుమారు రూ.80,000 వరకూ అదనంగా ఉండొచ్చని అంచనా.

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్

రెనో స్కాలా ఆటోమేటిక్ వేరియంట్


రెనో స్కాలాలో ప్రీమియం లెథర్ సీట్స్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, మల్టీఫంక్షనల్ స్మార్ట్ కీ, యాంత్రికంగా సర్దుబాటు చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్), క్రోమ్ రేడియేటర్ గ్రిల్, స్మోక్ స్టయిల్డ్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయెల్ టోన్ రియర్ బంపర్, క్రోమ్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, రియర్ క్రోమ్ గార్నిష్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, సౌకర్యవంతమైన రియర్ లెగ్‌రూమ్, విశాలమైన బూట్ స్పేస్‌ వంటి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఇంకా ఇందులో డ్రైవర్, ప్యాసింజర్‌ల కోసం డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), యాంటీ-పించ్ పవర్ విండోస్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాంటి వంటి విశిష్టమైన భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.స్కాలా సెడాన్, వినియోగదారుల సంతృప్తి కోసం ప్రపంచ వ్యాప్తంగా రెనో పాటిస్తున్న 'రెనో కంప్లీట్ కేర్' సర్వీస్‌తో లభిస్తుంది. ఇది 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

అంతేకాకుండా 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌తో పాటు ప్రతి 2,000, 10,000 మరియు 20,000 కి.మీ. లేబర్ ఫ్రీ సర్వీస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఫ్రాన్స్‌లోని రెనో ఫ్యాక్టరీలో శిక్షణ పొందిన కోటెక్ టెక్నీషియన్ల ద్వారా రెనో కార్లకు సర్వీస్ సేవలను అందిస్తుంది. రెనో స్కాలా సెడాన్ ఈ సెగ్మెంట్లోని స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా నిలువనుంది. ఇది ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ వైట్, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్) లభిస్తుంది.

Most Read Articles

English summary
Renault India has revealed plans to launch the automatic variants of its Scala entry level sedan soon. The French carmaker has said the Scala automatic will be an automatic choice for city car users tired of driving through slow traffic. It has added the Scala Automatic will be equipped with a X-tronic CVT gearbox instead of the conventional automatic system.
Story first published: Tuesday, January 15, 2013, 15:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X