నేడు విడుదల కానున్న బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న లగ్జరీ సెడాన్ 'బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్'లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను నేడు (ఏప్రిల్ 25, 2013) మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ గతంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇదివరకటి 7-సిరీస్ కన్నా మరింత మెరుగైన ఫీచర్లను, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించి అప్‌గ్రేడ్ చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను బిఎమ్‌‌డబ్ల్యూ ఇండియా నేడు దేశీయ విపణిలో విడుదల చేయనుంది.

సరికొత్త 2013 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారులో రివైజ్డ్ ఫ్రంట్ డిజైన్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, మరింత అప్‌రైట్ కిడ్నీ గ్రిల్, ఫుల్ అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, బూట్‌లిడ్‌పై క్రోమ్ స్ట్రిప్ వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు. ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ఫ్రంట్ సీట్లను కాస్త చిన్నవి చేశారు అలాగే వెనుక సీట్లను మరింత మెరుగుపరచారు. ఇంకా ఇందులో కొత్త డిజిటల్ డిస్‌ప్లే సిస్టమ్‌ను అమర్చారు, డ్రైవింగ్ మోడ్‌ను మార్చినప్పుడు ఇందులోని స్క్రీన్ కలర్ కూడా మారుతుంది.

ఐడ్రైవ్ సిస్టమ్ మరియు 3డి నావిగేషన్ మ్యాప్స్ కోసం కూడా ఈ కారులో 10.25 ఇంచ్ ఎల్‌సిడి డిస్‌ప్లే స్క్రీన్ ఉంటుంది. భారత్‌లో ఇది 730ఎల్‌డి, 740ఎల్ఐ వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ కొత్త వేరియంట్లలో ఇది వరకటి ఇంజన్లనే రీట్యూన్ చేసి ఉపయోగించారు. ఈ ఇంజన్ల సామర్థ్యాలలో స్వల్పంగా మార్పులు ఉన్నాయి. 2013 బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజిల్ ఇంజన్ సామర్థ్యాన్ని స్వల్పంగా పెంచగా, పెట్రోల్ వెర్షన్ మైలేజీని 21 శాతం మెరుగుపరచినట్లు కంపెనీ పేర్కొంది. ఈ రెండు వేరియంట్లు కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ (8 ఆటోమేటిక్ గేర్లు)తో లభిస్తాయి. వీటి ధరలు, ఇతర సాంకేతిక వివరాలకు సంబంధించిన తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూనే ఉండండి.

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ఫేస్‌లిఫ్ట్

Most Read Articles

English summary
German luxury carmaker BMW India is all set launch the facelift version 7-series today. The new upgraded BMW 7-series is slated to launch on April 25, 2013. The new car gets revised interiors and exteriors. Stay tuned to Drivespark for more details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X