లగ్జరీ కార్ వార్: హ్యాచ్‌బ్యాక్‌లతో హల్‌‌చల్ చేయనున్న కంపెనీలు

By Ravi

గతంలో ఇది వరకెన్నడూ లేనివిధంగా జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా, భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియాని అమ్మకాల పరంగా ఓవర్‌టేక్ చేసి ప్రథమ స్థానం దక్కించుకోవటంతో, సదరు లగ్జరీ కార్ కంపెనీలు కోల్పోయిన మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాన్నాయి.

ఇందులో భాగంగానే ఆడి జోరుకు చెక్ పెట్టేందుకు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు తమ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌లు ఇండియాకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, రానున్న 12-18 నెలల్లో కనీసం నాలుగు లగ్జరీ హ్యాచ్‍‌బ్యాక్‌లు, ఓ క్రాసోవర్ భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. వీటి ధరలు రూ.20-30 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ నెలాఖరు నాటికి తమ ఏ-క్లాస్ కారును, దాని తర్వాత బి-క్లాస్ డీజిల్ కారును మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తోంది. ఇకపోతే బిఎమ్‌డబ్ల్యూ ఇండియా రానున్న పండుగ సీజన్‌లో తమ పాపులర్ 1-సిరీస్ కారును విడుదల చేయనుంది. లగ్జరీ కార్ సెగ్మెంట్లో తాజాగా సాధించుకున్న తన అగ్రస్థానాన్ని నిలుపుకునేందుకు ఆడి ఇండియా తమ ఏ3 కారును ప్రవేశపెట్టాలని చూస్తోంది. అలాగే స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ కంపెనీ వోల్వో తమ వి40 క్రాసోవర్‌ను జూన్ విడుదల చేసే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌

బిఎమ్‌డబ్ల్యూ 1 సిరీస్‌

బిఎమ్‌డబ్ల్యూ తమ పాపులర్ 1 సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. రానున్న పండుగ సీజన్ నాటికి ఇది మార్కెట్లో విడుదల కానుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. ఈనెలాఖరు నాటికి ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన బి-క్లాస్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓ డీజిల్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఏ-క్లాస్ విడుదల అనంతరం ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా.

ఆడి ఏ3

ఆడి ఏ3

తాజాగా భారత లగ్జరీ కార్ మార్కెట్లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న ఆడి ఇండియా, తన స్థానాన్ని అలానే పదిలంగా కాపాడుకునేందుకు తమ పాపులర్ ఏ3 కాంపాక్ట్ కారును ఇండియాలో ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది.

వోల్వో వి40

వోల్వో వి40

స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ కంపెనీ వోల్వో తమ వి40 క్రాసోవర్‌ను జూన్ విడుదల చేసే అవకాశం ఉంది.


ఒకప్పటి గణాంకాల ప్రకారం, భారత లగ్జరీ కార్ మార్కెట్లో ప్రథమ స్థానంలో మెర్సిడెస్ బెంజ్, ద్వితీయ స్థానంలో బిఎమ్‌డబ్ల్యూ, తృతీయ స్థానంలో ఆడి కంపెనీలు ఉండేవి. అయితే, ఇప్పుడు ఈ స్థానాలు తారుమారు అయ్యాయి. తాజా గణాంకాలను బట్టి చూస్తే, ప్రథమ స్థానాన్ని ఆడి కైవసం చేసుకోగా, ఆ స్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ద్వితీయ స్థానంలోకి దిగజారిపోయింది. దశాబ్ధ కాలం పాటు భారత లగ్జరీ కార్ మార్కెట్‌ను ఏలిన మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం తృతీయ స్థానంతో సరిపెట్టుకుంది.

Most Read Articles

English summary
After Audi overtakes BMW in Indian luxury car maket, now BMW and Mercedes Benz will soon drive in their luxury hatchbacks to open up a new flank in the fiercely competitive Indian luxury car market.
Story first published: Thursday, May 9, 2013, 12:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X