టెస్టింగ్‌లో అపశృతి: మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

By Ravi

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా, భారత మార్కెట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా మన 'ఎస్101' (S101) అనే కోడ్‌నేమ్‌తో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్నట్లు గతంలో పలు కథనాల్లో మేము ప్రచురించిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, మహీంద్రా ఈ ఎస్‌యూవీని చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

అయితే, దురదృష్టవశాత్తు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని టెస్టింగ్ చేస్తుండగా, తమిళనాడులోని నీలగిరి ఘాట్ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ప్రవీన్ బాలన్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ యాక్సిడెంట్ ఫొటోలను తన వాల్‌పై పోస్ట్ చేశాడు. విడుదలకు ముందే, ఈ ఎస్‌యూవీ ప్రమాదానికి గురికావటంతో దీని సేఫ్టీ పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

తమిళనాడులోని నీలగిరి ఘాట్ వద్ద మహీంద్రా ఎస్101 టెస్టింగ్ దశలో ప్రమాదానికి గురైంది. మాకు అందిన సమాచారం ప్రకారం, ఘాట్ రోడ్డుపై వాహనం జారి వెనుకకు దొర్లిపోయి, రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

ఎస్101 అనే కోడ్ నేమ్‌తో మహీంద్రా అభివృద్ధి చేస్తున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

ఎమ్ అండ్ ఎమ్ స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటో దిగ్గజం శాంగ్‌యాంగ్‌తో కలిసి సంయుక్తంగా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీవి 'ఎస్101' అభివృద్ధి చేస్తున్నారు.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

ఆరు సీట్లు కలిగి ఉండటం ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ప్రధాన ప్రత్యేకత. ముందు వరుసలో మూడు సీట్లు, వెనుక వరుసలో మూడు సీట్లు ఉండేలా దీని ఇంటీరియర్ డిజైన్ ఉండనుంది.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

గేర్ బాక్స్‌ను డ్యాష్‌బోర్డులోనే అమర్చేలా (డాట్సన్ గో మాదిరిగా) దీని డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. మహీంద్రా క్వాంటో ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, ఎక్స్‌యూవీ500 డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

మహీంద్రా ఎస్101 కాంపాక్ట్ ఎస్‌యూవీని సరికొత్త మోనోకాక్ ఛాస్సిస్‌పై నిర్మించారు. ఇది నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉండి, తక్కువ ఎక్సైజ్ సుంకం పరిధిలోకి వస్తుంది.

మహీంద్రా ఎస్101 యాక్సిడెంట్

మహీంద్రా ఎస్101 ఫ్రంట్ వీల్ డ్రైవ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో 3-సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించవచ్చని సమాచారం. దేశీయ విపణిలో దీని ధర రూ.5 లక్షల ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Mahindra's upcoming compact SUV S101 has allegedly rolled over at Nilgiri ghats in Tamil Nadu. The S101 will come with 6 seats, 3+3 seater option. The S101 to compete with models like Ford EcoSport, Renault Duster. 
Story first published: Tuesday, December 10, 2013, 9:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X