ఆన్‌లైన్‌లో మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ ఫొటోలు లీక్

By Ravi

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) భారత మార్కెట్లో అందిస్తున్న 'మహీంద్రా వెరిటో' సెడాన్ ప్లాట్‌ఫామ్‌‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదవరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు ఈ మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు మరియు మరింత సమాచారం ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది.

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ ఈనెలలో మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం. ఇది వెరిటో సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంది కాబట్టి, దీని ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో సెడాన్ వెర్షన్‌లోని అనేక ఫీచర్లు కామన్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ స్పైషాట్స్‌ను గమనిస్తే, మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్ ముందు వైపు పూర్తిగా అది సెడాన్ వెర్షన్‌ను పోలినట్లు ఉంటుంది. ఇంటీరియర్లలో కూడా అనేక ఫీచర్లు ఒకేలా ఉండే అవకాశాలు ఉన్నాయి.

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్

మహీంద్రా వెరిటో హ్యాచ్‌బ్యాక్


చిన్న కార్లపై (4 మీటర్ల కన్నా పొడవు తక్కువ కలిగి ఉండే కార్లు) ప్రభుత్వం ఎక్సైజ్ రాయితీలను అందిస్తున్న నేపథ్యంలో, ఈ రాయితీలను పొందటం ద్వారా తక్కువ ధరకే ఈ కాంపాక్ట్ కారును అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్ అండ్ ఎమ్, ఈ వెరిటో హ్యాచ్‌బ్యాక్‌ను కూడా నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండేలా, వెనుక భాగాన్ని (బూట్ స్పేస్‌ను) తగ్గించి అభివృద్ధి చేసింది. ఇంజన్ పరంగా ఈ చిన్న కారులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు.

వెరిటో సెడాన్‌లో ఉపయోగించిన ఇంజన్లనే హ్యాచ్‌బ్యాక్ వెర్షన్ వెరిటోలోను ఉపయోగించనున్నారు. ఇది కూడా సెడాన్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్‌ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
As we reported earlier, India's leading SUV manufacturer Mahindra is planing to launch its new Hatchback car in Indian market very soon.The new company is testing the new compact Verito hatchback recently on Chennai roads. Now, some spy shot images leaked in internet.
Story first published: Monday, April 1, 2013, 11:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X