ఎయిర్‌బ్యాగ్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం మహీంద్రా ఎక్స్‌యూవీ500 రీకాల్

By Ravi

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఎక్స్‌యూవీ500 వాహనం మరోసారి రీకాల్‌కు గురయ్యింది. ఈ మోడల్‌లో ఎయిర్‌బ్యాగ్స్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌‌ను అప్‌డేట్ చేసేందుకు గాను కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.

జులై 2014కు ముందు ఉత్పత్తి చేసిన ఎక్స్‌యూవీ500 మోడళ్లను మాత్రమే మహీంద్రా రీకాల్ చేస్తోంది. సైడ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్స్‌కి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసేందుకు గాను ఈ రీకాల్‌ను ప్రకటిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది. అయితే, ఎన్ని యూనిట్లు ఈ రీకాల్‌కు వర్తిస్తాయనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

Mahindra XUV500 Recalled For Airbag Software Upgrade

మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాలను వినియోగించే కస్టమర్లకు ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను ఉచితంగా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మాత్రమేనని, కారులోపల ఎలాంటి భాగాలను మార్చాల్సిన అవసరం లేదని మహీంద్రా వివరించింది.

ఈ రీకాల్‍‌కు సంబంధించి తాము తమ కస్టమర్లను సంప్రదిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఒకవేళ మీరు కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ500 వాహనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, ఈ లింకుపై క్లిక్ చేసి మీ వాహన సీరియల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ను నమోదు చేసి మీ వాహనం రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

Most Read Articles

English summary
India's leading manufacturer and seller of utility vehicles has issued a recall of its product. Mahindra and Mahindra will be recalling its premium SUV the XUV500. The automobile manufacturer will be upgrading the software for airbags provided in their vehicle.
Story first published: Wednesday, February 18, 2015, 10:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X