హైదరాబాద్‌లో 9 సీటర్ మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ విడుదల

By Ravi

హైదరాబాద్: ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన 9-సీటర్ వెర్షన్ 'మహీంద్రా జైలో డి2 మ్యాక్స్' (Mahindra Xylo D2 MAXX)ను కంపెనీ తాజాగా రాష్ట్ర మార్కెట్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తొమ్మిది మంది ప్రయాణికులు (డ్రైవర్‌తో కలిపి) కూర్చొని ప్రయాణించేలా ఈ కొత్త జైలో డి2 డిమ్యాక్స్‌ను తయారు చేశారు.

రాష్ట్ర మార్కెట్లో మహీంద్రా జైలో డి2 మ్యాక్స్ ఎమ్‍‌పివి ధరను రూ.7.33 లక్షలు (బిఎస్‌3 వెర్షన్, ఎక్స్-షోరూమ్ హైదరాబాద్)గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఈ 9-సీటర్ ఎమ్‌పిని ప్రధానంగా టూర్ అండ్ ట్రావెల్ ఆపరేటర్స్, ప్యాసింజర్ మూవ్‌మెంట్ కోసం అభివృద్ధి చేశామని, ఇందులో సైడ్ ఫేసింగ్ రియర్ సీట్స్ (వెనుక వరుసలో ఎదురెదురుగా ఉండే సీట్లు) ఉంటాయని కంపెనీ వివరించింది.

Mahindra Xylo D2 MAXX 9 Seater

మహీంద్రా జైలో డి2 మ్యాక్స్‌లో 2.5 లీటర్ ఎమ్‌డిఐ సిఆర్‌డిఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బిఎస్3, బిఎస్4 కాలుష్య నిబంధనలను పాటిస్తుంది. ఈ ఇంజన్ లీటరుకు గరిష్టంగా 14.95 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
Most Read Articles

English summary
Mahindra and Mahindra has launched the Xylo D2 MAXX with 9 seats option in Hyderabad. This is the first time the Xylo, one of India’s most popular MPVs (multi-purpose vehicles) will be available with a 9 seats option, making it ideally suited for tour and travel operators, for passenger movement. Competitively priced at Rs. 7.33 lacs (BS3, ex-showroom Hyderabad), this variant boasts side-facing rear seats.
Story first published: Wednesday, November 13, 2013, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X