మారుతి ఆల్టో, వ్యాగన్ఆర్ కార్లలో కూడా ఏఎమ్‌టి గేర్‌బాక్స్!

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) సరకొత్త గేర్‌బాక్స్‌ను తమ సెలెరియో కారు ద్వారా పరిచయం చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ అనుకున్న దాని కన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందటంతో, కంపెనీ అందిస్తున్న ఇతర మోడళ్లలో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగానే, కంపెనీ అందిస్తున్న ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్ మరియు వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో కూడా ఏఎమ్‌టి వెర్షన్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న కారుగా రికార్డు సృష్టించిన ఆల్టో కారులో తాజాగా ఏఎమ్‌టి వెర్షన్‌ను కూడా జోడించినట్లయితే, ఇక ఈ మోడల్ అమ్మకాలు తిరుగుండదు. ఇదే నెంబర్ వన్ కారుగా చరిత్రను సృష్టించే అవకాశం ఉంది.


మరోవైపు భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్‌లో కూడా ఏఎమ్‌టి వెర్షన్‌ను ప్రవేశపెట్టినట్లయితే, ఈ మోడల్ అమ్మకాలు మరింత పుంజుకునే ఆస్కారం ఉంది. మొత్తమ్మీద చూసుకుంటే, మారుతి సుజుకి తమ ఎంట్రీ లెవల్ కార్లలో ఈ అధునాతన ఏఎమ్‌టి టెక్నాలజీని పరిచయం చేయటం ద్వారా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో అగ్రగామిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అటు పూర్తి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లోని సౌకర్యాన్ని మరియు ఇటు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానమైన మైలేజీని ఇవ్వగలగటం ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) యొక్క ప్రధాన లక్షణం. అంతేకాదు.. సాంప్రదాయ (ఫుల్లీ) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లతో పోల్చుకుంటే, ఈ ఏఎమ్‌టి ట్రాన్సిమిషన్ కలిగిన కార్లు అత్యంత సరమైన ధరకే లభించడం కూడా ఏఎమ్‌టి పాపులారిటీ మరో పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు.


ఆల్టో, వ్యాగన్ఆర్ కార్లతో పాటుగా భవిష్యత్తులో మారుతి సుజుకి అందిస్తున్న స్విఫ్ట్ వంటి పాపులర్ మోడళ్లలో కూడా ఈ తరహా ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే, కంపెనీ త్వరలో విడుదల చేయనున్న సియాజ్ (ఎస్ఎక్స్4 రీప్లేస్‌మెంట్ మోడల్) సెడాన్‌లో మాత్రం ఈ లోకాస్ట్ ఏఎమ్‌టి కాకుండా రెగ్యులర్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం.

ఇక సెలెరియో ఏఎమ్‌టి విషయానికి వస్తే.. భారత మార్కెట్లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్యలో లభిస్తున్న అత్యంత చవకైన మరియు ఏకైక ఆటోమేటిక్ కారు ఇదే. ప్రస్తుతం మార్కెట్లో సెలెరియో ఏఎమ్‌టి రెండు వేరియంట్లలో లభిస్తోంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:
సెలెరియో ఏఎమ్‌టి ఎల్ఎక్స్ఐ - రూ.4.14 లక్షలు
సెలెరియో ఏఎమ్‌టి విఎక్స్ఐ - రూ.4.43 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

Celerio AMT

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది లీటరుకు 23.1 కి.మీ. మైలేజీనిస్తుంది (మ్యాన్యువల్/ఏఎమ్‌టి).
Most Read Articles

English summary
Maruti Alto AMT soon. Maruti Suzuki to launch Alto automatic model followed by WagonR AMT automatic in 2015. Maruti to introduce AMT in all its models.
Story first published: Friday, March 7, 2014, 13:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X