మారుతి సెలెరియో డీజిల్ ఇంజన్ వెర్షన్ వస్తోంది!

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త చిన్న కారు 'సెలెరియో' అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈ సక్సెస్‌ఫుల్ సెలెరియోకు మరింత అదనపు సక్సెస్‌ను తెచ్చిపెట్టేందుకు కంపెనీ ఇందులో డీజిల్ వెర్షన్‌ను కూడా పరిచయం చేయాలని యోచిస్తోంది.

ప్రస్తుతం మారుతి సుజుకి 800సీసీ సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజన్‌ను తయారు చేస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిన్న డీజిల్ ఇంజన్‌ను తొలిసారిగా వై9టి అనే కోడ్ నేమ్‌తో కంపెనీ తయారు చేస్తున్న ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్)లో ఉపయోగించున్నారు. ఆ తర్వాత ఓ రీఫైన్డ్ 800సీసీ డీజిల్ ఇంజన్‌ను చిన్నకారులో ఉపయోగించనున్నారు.


కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, ఆ చిన్న కారు తాజాగా విడుదల చేసిన సెలెరియో అని తెలుస్తోంది. మారుతి సుజుకి ఈ డీజిల్ ఇంజన్ తమ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ సహకారంతో అభివృద్ధి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీజిల్ ఎల్‌సివితో పాటుగా డీజిల్ వెర్షన్ సెలెరియో కూడా మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
Maruti Eeco

కేవలం డీజిల్ వెర్షన్ సెలెరియోనే కాకుండా డీజిల్ వెర్షన్ ఈకో ప్యాసింజర్ క్యారియర్‌ను విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. మారుతి ఈకో ప్రస్తుతం పెట్రోల్ మరియు సిఎన్‌జి ఆప్షన్లలో మాత్రమే లభ్యమవుతోంది. ఇది 2016లో అందుబాటులోకి రావచ్చని అంచనా
Most Read Articles

English summary
It has been known for quite some time now that Suzuki is developing its first ever diesel engine, with a capacity of 800cc. Early reports have said that Maruti Suzuki will try out the new small capacity diesel engine, first in a commercial vehicle, followed by a passenger car.
Story first published: Thursday, April 24, 2014, 15:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X