ఆటో ఎక్స్‌పో 2014: మారుతి సుజుకి సెలెరియో విడుదల

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా ఇటీవలే నిలిపివేసిన తమ ఏ-స్టార్ హ్యాచ్‌బ్యాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కంపెనీ ఆవిష్కరించిన 'సెలెరియో' కారును నేడు వాణిజ్య పరంగా విడుదల చేసింది. ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ సరికొత్త మారుతి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసింది.

అత్యంత సరసమైన ధరకే మారుతి తమ సెలెరియో కారును ఆఫర్ చేస్తోంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.3.90 లక్షలు మాత్రమే (బేస్ మ్యాన్యువల్ వేరియంట్). ఇకపోతే ఎక్కువ మైలేజీనిచ్చే ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీతో కూడిన సెలెరియో ప్రారంభ దర 4.29 లక్షలు (ఈజీ డ్రైవ్ బేస్ వేరియంట్) మాత్రమే.

మోడ్రన్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్స్ స్పేస్, అధునా టెక్నాలజీ, ఈజీ డ్రైవ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్లు ఈ మారుతి సుజుకి సెలెరియో కారు ప్రత్యేకతలు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను, ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

కొలతలు

కొలతలు

మారుతి సెలెరియో 3600 మి.మీ. పొడవును, 1600 మి.మీ. వెడల్పును మరియు 2425 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి, కారులో విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. సెలెరియో బూట్‌స్పేస్ 235 లీటర్లు. వాస్తవానికి ఈ బూట్‌స్పేస్ స్విఫ్ట్ బూట్ స్పేస్ కన్నా అధికం.

ఇంజన్

ఇంజన్

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం కంపెనీ ఆఫర్ చేస్తున్న బ్లేజింగ్ రెడ్, పెరల్ ఆర్కిటిక్ వైట్, గ్లిస్టెనింగ్ గ్రే, సిల్కీ సిల్వర్ కలర్లతో పాటుగా, మరో మూడు ఆకర్షనీమైన రంగుల్లో లభిస్తుంది. అవి - సన్‌షైన్ రే, సెరులియన్ బ్లూ, కేవ్ బ్లాక్.

ఫీచర్స్

ఫీచర్స్

సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి.

వేరియంట్స్

వేరియంట్స్

మారుతి సుజుకి సెలెరియో మొత్తం ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో నాలుగు వేరియంట్లు మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుండగా, రెండు వేరియంట్లు ఈజీ డ్రైవ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానున్నాయి.

మారుతి సెలెరియో వేరియంట్లు, ధరలు

మారుతి సెలెరియో వేరియంట్లు, ధరలు

Celerio LXi (M): INR 3.9 lakhs
Celerio VXi (M): INR 4.20 lakhs
Celerio LXi (AT): INR 4.29 lakhs
Celerio VXi (AT): INR 4.59 lakhs
Celerio ZXi (M): INR 4.50 lakhs
Celerio ZXiOptional (M): INR 4.96 lakhs

 
Most Read Articles
English summary
The new Maruti Suzuki Celerio hatchback has been launched at the 2014 Auto Show with the announcements of the prices. The Celerio becomes India's most affordable ‘automatic' car with a starting price of INR 4.29 lakhs for the EZ Drive base variant. The range itself starts at INR 3.90 lakhs.
Please Wait while comments are loading...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X