ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో జీరో స్కోర్ పొందిన మారుతి ఆల్టో కె10

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న ఆల్టో బ్రాండ్‌లో లభ్యమవుతున్న ఆల్టో కె10 (1000సీసీ వెర్షన్ కారు) రోడ్డుపై సురక్షితం కాదా అంటే, ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్ అవుననే సమాధానమిస్తోంది.

ప్రమాదం సమయాల్లో ఆల్టో కె10 కారులో ప్రయాణించే వ్యక్తులు సురక్షితంగా బయటపడే అవకాశాలు ఏ కోశాన లేవని ఈ టెస్ట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. లాటిన్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్టులో మారుతి సుజుకి ఆల్టో కె10 జీరో స్కోర్ సంపాధించుకుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

ఇండిపెండెంట్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ లాటిన్ ఎన్‌సిఏపి కార్లను క్రాష్ టెస్ట్ చేసే సమయంలో అందులో మనుషులకు బదులుగా డమ్మీలను ఉంచి, డమ్మీలకు కలిగే ప్రమాదాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అంచనా వేసి, సేఫ్టీ రేటింగ్‌ను ఇస్తుంది.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

ఈ సేఫ్టీ రేటింగ్‌లో మొత్తం ఐదు స్టార్స్ (నక్షత్రాలు) ఉంటాయి. ఇందులో 4 లేదా ఐదు స్టార్లను దక్కించునే కార్లు అత్యంత సురక్షితంగా ఉన్నట్లు, అంతకన్నా తక్కువ స్టార్లను దక్కించుకునే కార్లు తక్కువ సేఫ్టీ కలిగిన కార్లుగా పరిగణిస్తారు.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

ఈ సేఫ్టీ క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో మారుతి సుజుకి ఆల్టో కె10 జీరో (సున్న రేటింగ్)ను దక్కించుకుంది. ఫ్రంట్ సీట్లలో కూర్చునే ప్రయాణికులకు జీరో సేఫ్టీ రేటింగ్ లభించగా, వెనుక సీట్లలో కూర్చునే పిల్లల సేఫ్టీ రేటింగ్ 3 స్టార్లను దక్కించుకుంది.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

లాటిన్ ఎన్‌సిఏపి రిపోర్టు ప్రకారం, సుజుకి ఆల్టో కె10 అడల్ట్ ఆక్యుపెంట్ (ఫ్రంట్ సీట్లలో కూర్చునే పెద్దవాళ్ల) సేఫ్టీ రేటింగ్‌లో జీరో స్కోర్ సాధించింది. ఇందుకు ప్రధాన కారణం, ఈ వాహన అస్థిర నిర్మాణమేని తెలిపింది.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

ప్రమాదాల్లో ఆల్టో కె10 కారులో ఫ్రంట్ ప్రయాణించే వారికి మరణం లేదా గాయాల రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే, చైల్డ్ ఆక్యుపెంట్ (చిన్న పిల్లల) సేఫ్టీ రేటింగ్ విషయంలో మాత్రం ఇది ఐదు స్టార్లకు గాను మూడు స్టార్లను దక్కించుకుంది.

ఆల్టో కె10 'సురక్షితం' కాదా..?

లాటిన్ అమెరికా దేశాల్లో అమ్ముడుపోతున్న అనేక రకాల బడ్జెట్ కార్లను లాటిన్ ఎన్‌సిఏపి టెస్ట్ చేసింది. ఇందులో భాగంగా సుజుకి సెలెరియో (మన మార్కెట్లో మారుతి ఏ-స్టార్)ను కూడా టెస్ట్ చేశారు. సెలెరియో (వాస్తవానికి నెక్స్ట్ జనరేషన్ ఆల్టో) ఐదు స్టార్లకు గాను నాలుగు స్టార్లను దక్కించుకుంది.

క్రాష్ టెస్ట్‌ వీడియో

మారుతి సుజుకి ఆల్టో కె10 లాటిన్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్ట్‌ను ఈ వీడియోలో వీక్షించవచ్చు.

Most Read Articles

English summary
Maruti Suzuki built Alto K10 has scored a zero in Latin NCAP's safety test. This is exactly the same car which sold 18,206 units in India in July, the highest selling model in the country. No only is it shameful, but it is also worrying that a model with virtually no passenger protection gets approved in some emerging markets, including India.
Story first published: Tuesday, August 13, 2013, 15:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X