మారుతి సెలెరియో ఏఎమ్‌టి వెయిటింగ్ పీరియడ్ 6 నెలలు!

By Ravi

హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) టెక్నాలజీతో మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) అతి కొద్ది సమయంలో మంచి పాపులరాటీని దక్కించుకుంది.

వాస్తవానికి మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సెలెరియో కన్నా ఏఎమ్‌టి సెలెరియోకి ఎక్కువగా ఎంక్వైరీలు, బుకింగ్‌లు వస్తున్నట్లు స్థానిక మారుతి సుజుకి డీలర్ ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఏఎమ్‌టి గేర్ బాక్స్ కలిగి సెలెరియో వెయిటింగ్ పీరియడ్ 6 నెలల వరకు ఉంటోందని, అంత సమయం వేచి ఉండలేని కస్టమర్లకు మ్యాన్యువల్ సెలెరియో తీసుకోమని సలహా ఇస్తున్నామని సదరు డీలర్‌షిప్ పేర్కొంది.


మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో సమానంగా మైలేజీనిస్తూ (23.1 కెఎమ్‌పిఎల్), సాంప్రదాయ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లతో పోల్చుకుంటే, వాటి కన్నా అత్యంత తక్కువ ధరకే ఈ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ కలిగిన సెలెరియో లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఈ మోడల్‌పై మక్కువ చూపుతున్నారు. ఈ కారుకు ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వస్తుంటే, అందులో సగానికి పైగా ఏఎమ్‌టి వేరియంట్‌లే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

మరోవైపు భారత ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కాంపాక్ట్ కార్లపై ఎక్సైజ్ సుంకాన్ని 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, మారుతి సుజుకి తమ సెలెరియో కారు ధరను కూడా భారీగా తగ్గించింది. తాజా తగ్గింపు తర్వాత మారుతి సుజుకి సెలెరియో బేస్ వేరియంట్ కేవలం రూ.3.76 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.3.90 లక్షలుగా ఉండేది).

Celerio AMT Waiting Period

టాప్ ఎండ్ వేరియంట్ సెలెరియో (జెడ్ఎక్స్ఐ ఆప్షనల్) రూ.4.79 లక్షలకే లభ్యమవుతోంది (ఇదివరకు ఈ వేరియంట్ ధర రూ.4.96 లక్షలుగా ఉండేది). ఇకపోతే, ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో కూడిన ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.4.14 లక్షలు గాను మరియు విఎక్స్ఐ వేరియంట్ రూ.4.43 లక్షలుగా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). తాజా తగ్గిన ధర కూడా ఈ మోడల్ అమ్మకాల పెరుగుదలకు ఓ పెద్ద కారణంగా చెప్పవచ్చు.

సెలెరియోలో 1.0 లీటర్ కె-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 68 పిఎస్‌‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో టాప్-ఎండ్ వేరియంట్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ ఓవిఆర్ఎమ్స్‌, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి మరెన్నో ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఇది లీటరుకు 23.1 కి.మీ. మైలేజీనిస్తుంది (మ్యాన్యువల్/ఏఎమ్‌టి).

Most Read Articles

English summary
Maruti Suzuki India's newly launched Celerio hatchback's AMT vesrion waiting period has went upto six months, according to a local dealer. The Celerio was launched at the Auto Expo on February 6 and comes with the Automatic Manual Transmission (AMT), a technology introduced for the first time in the mass segment.
Story first published: Thursday, March 6, 2014, 14:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X