పండుగ సీజన్‌లో మారుతి సుజుకి సియాజ్ విడుదల!

By Ravi

మారుతి సుజుకి అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్స్. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా మారుతి సుజుకి ఇండియా ఇకపై సెడాన్ విభాగంలో కూడా తన సత్తా ఏంటో చూపించేందుకు సిద్ధమవుతోంది.

గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ప్రదర్శించిన 'సియాజ్' (Ciaz) సెడాన్‌ను ఎస్ఎక్స్4 మోడల్‌కు రీప్లేస్‌మెంట్‌గా ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసినదే. రాబోయే పండుగ సీజన్ నాటికి ఈ మోడల్ మార్కెట్లో విడుదల కానుంది.

ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా తమ ఎస్ఎక్స్4 సెడాన్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు సమాచారం. మానేసర్ ప్లాంట్‌లో ఈ కొత్త సియాజ్ సెడాన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మోడల్ ఉత్పత్తికి సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ వెంటో వంటి కార్లకు గట్టి పోటీనిచ్చేలా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్‌ను మోడ్రన్‌గా డిజైన్ చేసింది. ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును అభివృద్ధి చేశారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్ నిజానికి ఎస్ఎక్స్‌4 సెడాన్ రీప్లేస్‌మెంట్ మోడల్ అయినప్పటికీ, పాత ఎస్ఎక్స్4 సెడాన్‌కు ఈ కొత్త సియాజ్ సెడాన్‌కు మధ్య ఎలాంటి పోలిక ఉండదు. సియాజ్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి డిజైన్ మార్పులను ఈ మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌లో చూడొచ్చు.

మారుతి సుజుకి సియాజ్

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. నాణ్యమైన ఇంటీరియర్స్, సుపీరియర్ ఫిట్ అండ్ ఫినిష్‌లను ఇందులో గమనించవచ్చు. అలాగే, టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సియాజ్‌లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, శాటిలైట్ నావిగేషన్, రియర్ ఎయిర్ కండిషనింగ్, హై-ఎండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న ఫీచర్లను ఆఫర్ చేయవచ్చని అంచనా.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సియాజ్‌లో కంపెనీ ఆఫర్ చేయనున్న ఇంజన్ ఆప్షన్ల గురించి ప్రస్తుతానికి స్పష్టమైన అవగాహన లేనప్పటికీ, ఇందులో 1.4 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్లతో పాటుగా సుజుకి స్వతహాగా అభివృద్ధి చేస్తున్న కొత్త ఇంజన్‌ను కూడా ఉపయోగించవచ్చని సమాచారం.

మారుతి సుజుకి సియాజ్

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ పెట్రోల్ వెర్షన్‌లో రెగ్యులర్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌లో కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. అయితే, ఈ మోడల్ ప్రీమియం బ్రాండ్ ఇమేజ్ కారణంగా, ఇందులో కంపెనీ ఇటీవలే సెలెరియోలో పరిచయం చేసిన ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి)ని ఉపయోగించపోవచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
At the recent 2014 Auto Expo that was held in New Delhi the Japanese manufacturer Maruti Suzuki has revealed its concept model of Ciaz sedan. The Ciaz is close to production ready and Maruti Suzuki are determined to launch it this year during the festive season.
Story first published: Monday, July 14, 2014, 11:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X