వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగాను విడుదల చేయనున్న మారుతి

By Ravi

మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి భారత మార్కెట్లోకి ప్రవేశించి అప్పుడే ఏడాది గడిచిపోయింది. గడచిన ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి ఇండియా తమ మొట్టమొదటి ఎమ్‌పివి ఎర్టిగాను విపణిలో విడుదల చేసింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఎర్టిగా మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. మారుతి సుజుకి ఈ ఏడాది సమయంలో దాదాపు 70,000 యూనిట్లకు పైగా ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయించింది.

ఎర్టిగా ఎమ్‌పివి వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకి ఇందులో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్ ఎర్టిగా బ్రోచర్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ యానివర్స్‌రే ఎడిషన్‌ను 'ఎర్టిగా ఫెలిజ్' (Ertiga Feliz) అని పిలువనున్నారు. ఎర్టిగా ఫెలిజ్‌లో లభ్యం కానున్న కొత్త ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ ఫినిషింగ్
  • ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్
  • ఆర్ట్ లెథర్ సీట్ కవర్స్
  • సీట్ కవర్లపై యానివర్స్‌రే బ్యాడ్జింగ్
  • ఆప్షనల్ బ్లూటూత్, జిపిఎస్ టచ్‌స్క్రీన్
  • రియర్ స్పాయిలర్
  • స్పెషల్ బాడీ గ్రాఫిక్స్
  • డిస్‌ప్లేతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్
  • ఏసి కంట్రోల్స్ బార్డర్‌పై బ్లాక్‌వుడ్ ఫినిషింగ్

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగా

Most Read Articles

English summary
Country's largest carmaker Maruti Suzuki India plans to launch a anniversary edition Ertiga MPV to celebrate the one year of this model in India. MSI has launched this MPV in April 2012, and has already sold more than 70,000 units of Ertiga in an year. The new car would be called as "Ertiga Feliz".
Story first published: Wednesday, May 8, 2013, 11:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X