వార్షికోత్సవ ఎడిషన్ ఎర్టిగాను తీసుకురానున్న మారుతి

By Ravi

దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి లభిస్తున్న మొట్టమొదటి బహుళ ప్రయోజన వాహనం 'ఎర్టిగా' భారత మార్కెట్లో విడుదలయ్యి అప్పుడే ఏడాది పూర్తి కావస్తోంది. గడచిన ఏప్రిల్ నెలలో కంపెనీ తమ ఎర్టిగా ఎమ్‌పివి దేశీయ విపణిలో విడుదల చేసింది. సరసమైన ధర, అధిక సీటింగ్ కెపాసిటీ, మెరుగైన మైలేజ్, విశ్వసనీయమైన బ్రాండ్ తదితర ప్రత్యేకతలతో మారుతి సుజుకి ఎర్టిగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.

ఎర్టిగా మార్కెట్లోకి విడుదలైన సంవత్సరం రోజుల్లోనే 70,000 లకు పైగా యూనిట్లు అమ్ముడుపోయాయంటే ఈ మోడల్ పట్ల ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో, ఎర్టిగా ఎమ్‌పివి విజయాన్ని పురస్కరించుకొని మారుతి సుజుకి ఇందులో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి ఓ కొత్త సెలబ్రేషన్ ఎడిషన్ వేరియంట్ ఎర్టిగా మారుతి విడుదల చేయనుంది.

ఈ సెలబ్రేషన్ ఎడిషన్ మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో క్రోమ్ ఫినిష్డ్ ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, ఆర్ట్ లెథర్ సీట్ కవర్స్, సీట్ కవర్లపై యానివర్సరే బ్యాడ్జింగ్, ఆప్షనల్ బ్లూటూత్ అండ్ జిపిఎస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించే ఆస్కారం ఉంది. ఈ మోడల్ విడుదలపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, మరికొద్ది రోజుల్లోనే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా

ప్రస్తుత మారుతి సుజుకి ఎర్టిగా


ప్రస్తుతం భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. ఇందులో తొలిసారిగా మారుతి సుజుకి అభివృద్ధి చేసిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 95 పిఎస్‌ల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు పెట్రోల్‌కు 16.02 కి.మీ. మైలేజీనిస్తుంది. డీజిల్ వేరియంట్ ఎర్టిగాలో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్‌టర్బో విజిటి డీజిల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 20.77 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

Most Read Articles

English summary
When Maruti Suzuki launched the Ertiga MPV in India last year they ended up creating a new segment, one that was right below a full sized MPV such as the Toyota Innova. The automaker called it LUV, short for Light Utility Vehicle and people loved it. If several recent reports are to be believed and also considering the fact that Maruti Suzuki has come out with several special and limited edition models in recent times, a special edition Ertiga could be on the line next.
Story first published: Tuesday, April 9, 2013, 17:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X