ఫ్యూయెల్ నెక్ ఫిల్లర్ సమస్య: 1.5 లక్షల స్విఫ్ట్ డిజైర్ కార్ల రీకాల్

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఓ చిన్న సమస్య తలెత్తడంతో కంపెనీ ఏకంగా 1.5 లక్షల కార్లను వెనక్కి (రీకాల్) పిలిపించింది. దీంతో, భారతదేశంలో సింగిల్ మోడల్ కోసం ఇంత భారీ సంఖ్యలో రీకాల్ చేసిన మోడళ్లలో తాజాగా స్విఫ్ట్ డిజైర్ కూడా చేరిపోయింది.

ఫ్యూయెల్ నెక్ ఫిల్లర్ సమస్య కారణంగా ఈ కార్లను రీకాల్ చేస్తున్నట్లు సమాచారం. 2013 మరియు 2014 సంవత్సరాల్లో తయారైన స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి. ప్రభావితమైన కార్లలో ఈ విడిభాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేయనుంది. ఈ ఫ్యూయెల్ నెక్ ఫిల్లర్‌లను జెబిఎమ్ అనే విడిభాగాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది.

Swift Dzire Recall

జెబిఎమ్‌లో మారుతి సుజుకి ఇండియాకు 29.28 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం 1.5 లక్షల స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఇంకా కొన్ని డీలర్ల వద్దనే ఉన్నాయి. ఇలాంటి వాహనాల విషయంలో ఈ లోపపూరితమైన విడిభాగాన్ని కస్టమర్లకు విక్రయించడానికి ముందే డీలర్లు మార్చి ఇవ్వనున్నారు. పాత వాహనాల విషయంలో కస్టమర్లకు ప్రత్యేకంగా సమాచారం అందించనున్నారు.

గడచిన సంవత్సరం నవంబర్ నెలలో కూడా మారుతి సుజుకి 1492 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, ఏ-స్టార్ కార్లను స్టీరింగ్ సమస్యకు సంబంధించి రీకాల్ చేసిన సంగతి తెలిసినదే. మారుతి స్విఫ్ట్ డిజైర్ ఫిబ్రవరి 2012లో తొలిసారిగా భారత మార్కెట్లో విడుదలైంది.

Most Read Articles

English summary
India’s largest car maker Maruti Suzuki will be recalling around 1.5 lakh units of the new Swift Dzire compact sedans due to faulty fuel neck filler.
Story first published: Tuesday, April 8, 2014, 17:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X