మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌‌ను ప్రవేశపెట్టింది. 'రిట్జ్ ఎలేట్' (Ritz Elate) పేరిట మారుతి సుజుకి ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. రెగ్యులర్ వెర్షన్ రిట్జ్‌కి ఈ కొత్త రిట్జ్ ఎలేట్ మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా దీనికి అదనపు బాడీ కిట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇంకా ఇందులో మరిన్ని అదనపు ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

మారుతి సుజుకి రిట్జ్‌లో లభించే అదనపు ఫీచర్లు:
* 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్ (స్పీకర్స్)
* ఆరెంజ్ కలర్ సీట్ కవర్స్
* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
* బ్లూటూత్ కిట్
* బ్లాక్ డోర్ విజర్స్
* స్టయిలిష్ ఫ్లోర్ మ్యాట్స్
* యాంబీంట్ లైటింగ్ సిస్టమ్
* ఎర్గోనమిక్ నెక్ కుషనింగ్
* ధృడమైన మడ్ ఫ్లాప్స్
* స్టీరింగ్ వీల్ కవర్
* మల్టీ పర్పస్ బ్యాగ్

Maruti Suzuki Ritz Elate

మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ లిమిటెడ్ ఎడిషన్‌లో పైన పేర్కొన్న మార్పుల తప్పు బేసిక్ డిజైన్‌లోని కానీ లేదా ఇంజన్ పరంగా కానీ ఎలాంటి మార్పులు లేవు. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్, 4-సిలిండర్, కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్, 4-సిలిండర్, ఫియట్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తాయి. పెట్రోల్ వెర్షన్‌లో మాత్రం 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షనల్‌గా అందుబాటులో ఉంది.

ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి రిట్జ్ ఎలేట్ ధరను మారుతి సుజుకి వెల్లడించకపోయినప్పటికీ, రెగ్యులర్ వేరియంట్ల కన్నా దీని ధర సుమారు రూ.20,000 నుంచి రూ.30,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Maruti Suzuki India has launched a limited edition version called "ELATE" of its Ritz hatchback. Ritz Elate is loaded with 12 new additional features.
Story first published: Monday, July 14, 2014, 15:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X