మారుతి స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, వివరాలు

By Ravi

మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ 'స్విఫ్ట్ డిజైర్' (Swift Dzire)లో కంపెనీ తాజాగా ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. రిఫ్రెష్డ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో విడుదలైన ఈ కొత్త 2015 స్విఫ్ట్ డిజైర్‌ను మారుతి సుజుకి కేవలం రూ.5.07 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే విక్రయిస్తోంది.

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా చెప్పుకోదగిన అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. వాస్తవానికి స్విఫ్ట్ డిజైర్ బేసిక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, కారు ముందు వైపు, వెనుక వైపు కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. అలాగే ఇంటీరియర్లలో మైనర్ అప్‌డేట్స్ ఉన్నాయి. మరి కొత్త స్విఫ్ట్‌లోని కొత్త ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్

ఫ్రంట్ క్రోమ్ గ్రిల్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ముందు వైపు కొత్త క్రోమ్ గ్రిల్‌ను జోడించారు. ఈ క్రోమ్ గ్రిల్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ని తెచ్చి పెడుతుంది.

ఫాగ్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్

ఫాగ్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫ్రంట్ బంపర్‌లో అమర్చిన ఫాగ్ ల్యాంప్స్ దగ్గర క్రోమ్ గార్నిష్ చేశారు. ఇది కూడా కారు ప్రీమియం అప్పీల్‌ను పెంచడంలో తోడ్పతుంది.

న్యూ లుక్ హెడ్‌ల్యాంప్స్

న్యూ లుక్ హెడ్‌ల్యాంప్స్

ఫ్రెష్ లుక్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్‌ను కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో ఆఫర్ చేస్తున్నారు. టాప్-ఎండ్ వేరియంట్లో ఇవి స్మోక్డ్ ఫినిష్‌తో లభ్యం కానున్నాయి.

ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్

ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్స్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో ఆఫర్ చేస్తున్న సైడ్ మిర్రర్లను యాంత్రికంగా సర్దుబాటు చేసుకోవటమే కాకుండా, అవసరం లేదనుకున్నప్పుడు యాంత్రికంగానే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు.

మోషన్ థీమ్డ్ అల్లాయ్ వీల్స్

మోషన్ థీమ్డ్ అల్లాయ్ వీల్స్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో సరితొత్త మోషన్ థీమ్డ్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇవి రన్నింగ్‌లో కారుకు మంచి ప్రీమియం అప్పీల్‌ని తెచ్చిపెడుతాయి.

బీజ్ ఇంటీరియర్స్

బీజ్ ఇంటీరియర్స్

కారు ఇంటీరియర్స్‌ని గమనిస్తే, ఇది బీజ్ కలర్ ఇంటీరియర్ థీమ్‌తో లభిస్తుంది. డ్యాష్‌బోర్డ్ పై సగభాగం బ్లాక్ కలర్‌లోను క్రింది భాగం బీజ్ కలర్‌లోను ఉంటుంది. బీజ్ కలర్ ఇంటీరియర్స్ కారుకు మరింత ప్రీమియం లుక్‌ని తెచ్చిపెడుతాయి.

ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్

ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు. ప్రీమియం కార్లలో మాత్రమే లభించే ఈ తరహా ఫీచర్ బడ్జెట్ సెడాన్లో కూడా లభ్యం కావటం విశేషం.

రియర్ పవర్ సాకెట్

రియర్ పవర్ సాకెట్

టాప్-ఎండ్ వేరియంట్ కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో వెనుక సీటులో కూర్చునే ప్రయాణీకుల కోసం రియర్ 12-వోల్ట్ పవర్ సాకెట్‌ను ప్రొవైడ్ చేశారు. దీని సాయంతో గ్యాడ్జెట్లను చార్జ్ చేసుకోవచ్చు.

బ్లూటూత్ ఆడియో సిస్టమ్

బ్లూటూత్ ఆడియో సిస్టమ్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. దీని సాయంతో మీ స్మార్ట్ ఫోన్‌ను కారుతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఉడెన్ ఫినిషింగ్

ఉడెన్ ఫినిషింగ్

కారు ఇంటీరియర్‌కి ప్రీమియం లుక్ కల్పించేందుకు గాను డ్యాష్‌బోర్డుపై అలాగే డోర్ ట్రిమ్స్‌పై ఉడెన్ ఫినిషింగ్ టచ్ చేశారు.

స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

టాప్-ఎండ్ వేరియంట్ స్విఫ్ట్ డిజైర్ మోడల్‌లో స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ టెలిఫోన్ కంట్రోల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

మ్యాప్ ల్యాంప్స్

మ్యాప్ ల్యాంప్స్

క్యాబిన్ లోపల డ్రైవర్, కోప్యాసింజర్ కోసం రెండు ఇండివిడ్యువల్ మ్యాప్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు.

ఏబిఎస్

ఏబిఎస్

కొత్త 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది. ఇది మంచి బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను అందిస్తుంది.

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

కొత్త 2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ టాప్-ఎండ్ వేరియంట్‌లో రివర్స్ పార్కింగ్ సెన్సార్లను ఆఫర్ చేస్తున్నారు. ఇవి కారును సురక్షితంగా రివర్సు చేయటంలో సహకరిస్తాయి.

ఇంజన్స్

ఇంజన్స్

పెట్రోల్ వెర్షన్ స్విఫ్ట్ డిజైర్‌లోని 1.2 లీటర్ ఇంజన్ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ స్విఫ్ట్ డిజైర్‌లోని 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 74 బిహెచ్‌పిల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, పెట్రోల్ వెర్షన్ డిజైర్ లీటరుకు గరిష్టంగా 20.85 కిలోమీటర్ల మైలేజీని, డీజిల్ వెర్షన్ డిజైర్ లీటరుకు గరిష్టంగా 26.59 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

దేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కారు

దేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే డీజిల్ కారు

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ లీటరుకు గరిష్టంగా 26.59 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తూ ఈ సెగ్మెంట్లోనే కాకుండా భారతదేశంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలిచింది.

పెట్రోల్ వెర్షన్ ధరలు

పెట్రోల్ వెర్షన్ ధరలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ - రూ.5.07 లక్షలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.5.20 లక్షలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ - రూ.5.85 లక్షలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ - రూ.6.80 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ ధరలు

డీజిల్ వెర్షన్ ధరలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్‌డిఐ - రూ.5.99 లక్షలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ విడిఐ - రూ.6.85 లక్షలు

2015 మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్‌డిఐ - రూ.7.81 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

కొత్త 2015 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మొత్త ఏడు ఆకర్షనీయమైన రంగులలో లభ్యం కానుంది. అవి

1. పెరల్ ఆర్కిటిక్ వైట్

2. సిల్కీ సిల్వర్

3. కేవ్ బ్లాక్

4. పసిఫిక్ బ్లూ

5. మాగ్మా గ్రే

6. ఆల్ప్ బ్లూ

7. సంగ్రియా రెడ్

Most Read Articles

English summary
Maruti Suzuki India has launched refreshed version of its popular compact sedan Swift Dzire with introductory prices ranging from Rs 5.07 lakh to Rs 7.81 lakh (ex-showroom Delhi). Take a look the new features in this hot selling compact sedan.
Story first published: Tuesday, February 24, 2015, 20:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X