మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్; 2014 ఆటో ఎక్స్‌పోలో విడుదల

By Ravi

మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో ఒకటైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే కొత్త అవతారంలో కనిపించబోతుంది. ఆగస్ట్ 2011లో మారుతి సుజుకి తమ స్విఫ్ట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. అంతకు ముందు స్విఫ్ట్‌తో పోల్చుకుంటే, కొత్త స్విఫ్ట్‌లో అనేక మార్పులు చేర్పులు చేసి కంపెనీ ప్రస్తుత స్విఫ్ట్‌ను అందిస్తోంది.

అయితే, మారుతున్న మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా, కొత్త ఉత్పత్తులను అందించాలనే కంపెనీల లక్ష్యంలో భాగంగా, మారుతి సుజుకి మరోసారి ఇందులో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి తమ సరికొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

కొత్త స్విఫ్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈ ఏడాది జులై నెలలోనే గ్లోబల్ మార్కెట్లలో అప్‌గ్రేడెడ్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

పరిశ్రమ వర్గాల సమాచారం, ఈ గ్లోబల్ వెర్షన్ సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉండే అనేక ఫీచర్లు మన ఇండియన్ వెర్షన్ మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్విఫ్ట్‌కు కొత్త 2014 స్విఫ్ట్‌కు బేసిక్ డిజైన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. అయితే, 2014 సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఓఆర్‌విఎమ్‌లపై టర్న్ ఇండికేటర్స్, ఫాగ్‌ ల్యాంప్స్ చుట్టూ అమర్చిన L షేపులో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

కొత్త స్విఫ్ట్‌లో ఎక్స్టీరియర్ పరంగా కాస్మోటిక్ మార్పులు తప్ప డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో కొత్తగా బూస్ట్ బ్లూ మెటాలిక్ ఎక్స్టీరియర్ కలర్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే, అల్లాయ్ వీల్స్ డిజైన్‌ను కూడా మార్చవచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్స్ మార్పుల విషయానికి వస్తే, బ్లూ అండ్ గ్రేలో మ్యాచింగ్ సీట్ కవర్స్, డ్రైవర్ సైడ్ పవర్ విండోకు ఆటో అప్ బటన్, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, పవర్ ఫోల్డింగ్ వింగ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభించే ఆస్కారం ఉంది. అయితే, ఇవన్నీ టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. డ్యాష్ బోర్డ్ డిజైన్‌లో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతానికి ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ ఫియట్ మల్టీజెట్ ఇంజన్లనే కొత్త స్విఫ్ట్‌లోను ఉపయోగించనున్నారు. గ్లోబల్ వెర్షన్ స్విఫ్ట్‌లో కొత్తగా క్రూయిజ్ కంట్రోల్, స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఇది ఇండియన్ వెర్షన్‌లో ఉంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎక్స్ఏ ఆల్ఫా (సుజుకి ఐవి4), ఏ-విండ్ కాన్సెప్ట్, కొత్త ఎస్ఎక్స్4 వంటి మోడళ్లతో పాటుగా మారుతి సుజుకి తమ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ స్విఫ్ట్‌ను కూడా ప్రదర్శించవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
The new Maruti Suzuki Swift facelift is getting ready to debut at the 2014 Delhi Auto Expo in February next year. Facelift Swift gets the LED daytime running lights in the front bumper and few other interior, exterior upgrades.
Story first published: Thursday, December 19, 2013, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X