మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల; ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ లేవు!

By Ravi

మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ నేడు (అక్టోబర్ 28, 2014) తమ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

దేశీయ విపణిలో ఈ కొత్త 2014 స్విఫ్ట్ ప్రారంభ ధర రూ.4.42 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త 2014 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో కొద్దిపాటి కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా మెకానికల్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందా రండి..!


పెట్రోల్ ఇంజన్ అప్‌డేట్స్:
కొత్త 2014 స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్ పవర్‌ను మార్జినల్‌గా తగ్గించారు. గతంలో ఇది 85.8 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తే, ఇప్పుడు ఇది 83.1 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మార్పు వలన 9.7 శాతం మైలేజ్ పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. గతంలో ఇది లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తే, ఇప్పుడు కొత్త స్విఫ్ట్ లీటరుకు 20.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్).

డీజిల్ ఇంజన్ అప్‌డేట్స్:
కొత్త 2014 స్విఫ్ట్ డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.3 లీటర్ ఇంజన్ పవర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కానీ ఈసియూ (ఇంజన్ కంట్రోల్ యూనిట్)లో చేసిన కొద్దిపాటి మార్పుల కారణంగా ఫ్రిక్షన్ తగ్గి, 10 శాతం మైలేజ్ పెరుగుతుందని కంపెనీ పేర్కొంది. గతంలో ఇది లీటరుకు 22.9 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తే, ఇప్పుడు కొత్త స్విఫ్ట్ లీటరుకు 25.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్).


ఎక్స్టీరియర్ మార్పులు:
- ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేశారు. ఇప్పుడు ఇది పెద్ద ఎయిర్ డ్యామ్‌తోను మరియు సిల్వర్ అసెంట్స్‌తో కూడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌తోను లభిస్తుంది.
- ముందు వైపు కొత్త హనీకోంబ్ గ్రిల్‌ను ఏర్పాటు చేశారు.
- టాప్-ఎండ్ వేరియంట్‌లో కొత్త అల్లాయ్ వీల్స్‌ను, బేస్ మరియు మిడ్ వేరియంట్లలో కొత్త వీల్ క్యాప్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.
- వైలెట్, రెడ్ మరియు గ్రే అనే మూడు కొత్త బాడీ కలర్ ఆప్షన్లను అందుబాటులో ఉంచారు.

ఫీచర్ అప్‌గ్రేడ్స్:
- ఎల్ఎక్స్ఐ, ఎల్‌డి వేరియంట్లలో వెనుక సీట్లు ఇప్పుడు అడ్జస్టబల్ హెడ్‌రెస్ట్స్, 60:40 స్ప్లిట్ ఆప్షన్‌తో లభిస్తాయి.
- కొత్తగా చేర్చిన ఎల్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్‌లో ఫ్రంట్ పవర్ విండోస్, రిమోట్ లాకింగ్ ఫీచర్‌ను ఆఫర్ చేస్తున్నారు.
- విఎక్స్ఐ, విడిఐ వేరియంట్లలో ఆడియో ప్లేయర్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబిల్ వింగ్ మిర్రర్స్ మరియు ఏబిఎస్ (విడిఐలో మాత్రమే)లను జోడించారు.
- టాప్-ఎండ్ జెడ్ఎక్స్ఐ, జెడ్‌డిఐ వేరియంట్లలో రిమోట్ లాకింగ్, పుష్ బటన్ స్టార్ట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్, రియర్ పార్కింగ్స్ సెన్సార్స్ ఫీచర్లు లభ్యం కానున్నాయి.


వేరియంట్లు - ధరలు:
పెట్రోల్ వేరియంట్లు

* స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ - రూ.4.42 లక్షలు
* స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ (ఆప్షనల్) - రూ.4.49 లక్షలు
* స్విఫ్ట్ విఎక్స్ఐ - రూ.5.08 లక్షలు
* స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ - రూ.5.90 లక్షలు

డీజిల్ వేరియంట్లు
* స్విఫ్ట్ ఎల్‌డిఐ - రూ.5.56 లక్షలు
* స్విఫ్ట్ విడిఐ - రూ.6.00 లక్షలు
* స్విఫ్ట్ జెడ్‌డిఐ - రూ.6.95 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Swift Facelift

పాత స్విఫ్ట్‌కి కొత్త స్విఫ్ట్‌కి ధర పరంగా చూసుకుంటే.. కొత్త స్విఫ్ట్ ధరలు రూ.10,000 నుంచి రూ.24,000 వరకు పెరిగాయి. పెట్రోల్ వెర్షన్ ఎంట్రీ లెవల్ స్విఫ్ట్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, కానీ ఇతర వేరియంట్ల ధరలు మాత్రం పెరిగాయి.

ఇకపోతే.. కొత్త 2014 స్విఫ్ట్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ (ఫాగ్‌ల్యాంప్స్ పక్కన) చూడాలనుకున్న స్విఫ్ట్ ప్రియుల కల కలగానే మిగిలిపోయింది. కొత్త స్విఫ్ట్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్‌కి బదులుగా సిల్వర్ కలర్ స్ట్రైప్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది. దూరం నుంచి చూస్తే, ఇది డేటైమ్ రన్నింగ్ లైట్ ఫీల్‌ని కలిగించినప్పటికీ, ఇది ప్రకాశించదు కాబట్టి ఈ అప్‌డేట్ ఉన్నా లేకపోయినా ఒక్కటే.

బహుశా.. ఈసారి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను ఆప్షనల్‌గా చేర్చి, మరోసారి ఫేస్‌లిఫ్ట్ పేరిట కంపెనీ ఇందులో మరో కొత్త వేరియంట్‌ను ఏమైనా విడుదల చేస్తుందేమో చూడాలి. మొత్తమ్మీద చూసుకుంటే, ఎక్స్టీరియర్‌లో కొద్దిపాటి మార్పుల వలన పాత స్విఫ్ట్‌కు కొత్త స్విఫ్ట్‌కు పెద్ద తేడా ఏమీ అనిపించదు. అయితే, ఇంటీరియర్స్ మరియు టాప్-ఎండ్ వేరియంట్‌లో మాత్రం కొన్ని చెప్పుకోదగిన ఫీచర్లను ఆఫర్ చేస్తున్నారు.

Most Read Articles

English summary
Maruti Suzuki India has silently launched the facelift version of its popular Swift hatchback at a starting price of Rs. 4.42 lakh (ex-showroom, Delhi). The new 2014 Maruti Suzuki Swift gets some minor cosmetic, feature and mechanical updates.
Story first published: Tuesday, October 28, 2014, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X