మారుతి సుజుకి ఎస్ఎక్స్4 సెడాన్ రీప్లేస్‌మెంట్ 'సియాజ్'

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ఎస్ఎక్స్4'ను సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్ చేయటంలో కంపెనీ విఫలమైంది. ఇదే సెగ్మెంట్లోని హోండా సిటీ, ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లు మంచి సక్సెస్‌ను సాధిస్తే, మారుతి ఎస్ఎక్స్4 మాత్రం కంపెనీకి ఆశించిన ఫలితాలను తెచ్చిపెట్టలేకపోయింది.

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ఎస్ఎక్స్4 స్థానాన్ని భర్తీ చేస్తూ, కంపెనీ ఇందులో ఓ సరికొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. అంతేకాదు, ఈ కొత్త మిడ్-సైజ్ సెడాన్‌కు 'సియాజ్' (Ciaz) అనే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 5వ తేది నుంచి ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తమ సరికొత్త సియాజ్ సెడాన్‌ను ప్రదర్శించే అవకాశం ఉంది.


ఇదివరకటి మారుతి ఎస్ఎక్స్4 సెడాన్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఆకర్షనీయమైన లుక్, విలాసవంతమైన ఫీచర్లతో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త మోడల్ కారును ఇప్పటికే 'వైఎల్1' (YL1) అనే కోడ్ నేమ్‌తో మారుతి సుజుకి తమ మానేసర్ ప్లాంటులో అభివృద్ధి చేస్తోంది. పాత ఎస్ఎక్స్4 సెడాన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త సియాజ్ సెడాన్‌లో కొత్త క్రోమ్-ఫినిష్ గ్రిల్, రీ-ప్రొఫైల్ చేయబడిన బంపర్స్, కొత్త హెడ్‌ల్యాంప్స్, సరికొత్త రియర్ డిజైన్ వంటి బాహ్య మార్పులు ఉండనున్నాయి.

అలాగే, ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో నావిగేషన్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. ఈ కొత్త మారుతి సియాజ్ సెడాన్ భారత మార్కెట్లోనే కాకుండా చైనా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కూడా అమ్ముడుపోనుంది. భారత్ నుంచి విడి భాగాలను ఆయా దేశాలకు దిగుమతి చేసుకొని, ఈ మోడల్‌ను అసెంబ్లిగ్ చేసే అవకాశం ఉంది.

Maruti YL1

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి వెర్షన్లలో అందుబాటులో ఉన్న ఎస్ఎక్స్4 ఇంజన్లనే ఈ కొత్త మారుతి సియాజ్‌లోను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1586సీసీ ఇంజన్‌ 104.7 పిఎస్‌ల శక్తిని, 145 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్4లో ఉపయోగించిన 1248సీసీ ఇంజన్ 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్4 సెడాన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (జెడ్ఎక్స్ఐ వేరియంట్)లతో లభిస్తుండగా డీజిల్ వేరియంట్ కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తోనే లభ్యమవుతుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Country's largest car maker Maruti Suzuki India is planing to launch a new mid-size sedan to replace the SX4 in 2014 Auto Expo. Sources close, have revealed that the car could launch during February 2014, near to 2014 Delhi Auto Expo. 
Story first published: Tuesday, January 28, 2014, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X