ఆగస్ట్ 21న మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే విడుదల

By Ravi

మారుతి సుజుకి ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు 'వ్యాగన్ఆర్ స్టింగ్‌రే' (Wagon R Stingray) రేపు (ఆగస్ట్ 21, 2013) మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం వ్యాగన్ఆర్‌కు రీడిజైన్డ్ వెర్షనే ఈ వ్యాగన్ఆర్ స్టింగ్‌రే హ్యాచ్‌‌బ్యాక్.

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే ఇప్పటికే జపాన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న రెగ్యులర్ వెర్షన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌తో పాటుగానే ఈ కొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే హ్యాచ్‌బ్యాక్ కూడా లభ్యం కానుంది. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు, స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న వ్యాగన్ఆర్ కన్నా వ్యాగన్ఆర్ స్టింగ్‌రే మరింత ఆకర్షనీయమైన డిజైన్, విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది. ప్రస్తుత వ్యాగన్ఆర్‌కు ఎగువన ఈ కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రీమియం స్పోర్టీ వెర్షన్ వ్యాగన్ఆర్ స్టింగ్‌రేకు సంబంధించిన మరింత సమాచారన్ని, లేటెస్ట్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రంట్ డిజైన్

ఫ్రంట్ డిజైన్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రేను కొత్త మోడల్‌గా ప్రస్తుత వ్యాగన్ఆర్‌తో పాటుగా విక్రయిస్తారు. ఈ ఫొటోను గమనిస్తే, వ్యాగన్ఆర్ స్టింగ్‌రే డిజైన్ పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. సన్నటి గ్రిల్, షార్ప్ హెడ్‌ల్యాంప్స్, కొత్త బంపర్, పెద్ద ఎయిర్‌డ్యామ్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మొత్తమ్మీద చూస్తే, ఇది బాక్స్ షేప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌

ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌

ప్రీమియం కార్లలో లభించే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ఈ వ్యాగన్ఆర్ స్టింగ్‌రేలోను ఆఫర్ చేయనున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా మొదటి ఫీచర్‌గా లభ్యం కానుంది. అయితే, ఇది కేవలం ఆప్షనల్ అప్‌గ్రేడ్‌గా మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

రియర్ డిజైన్

రియర్ డిజైన్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే వెనుక డిజైన్‌ను గమనిస్తే, ఇది వెనుక వైపు నిటారుగా ఉన్నట్లు అనిపిస్తుంది. టెయిల్ లైట్లకు క్రోమ్ లైనింగ్‌ను జోడించి మరింత ప్రీమియం లుక్‌ను కల్పించారు.

ఇంటీరియర్స్‌

ఇంటీరియర్స్‌

ఇంటీరియర్స్‌ను గమనిస్తే, బ్లాక్ కలర్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, క్రోమ్ కోటెడ్ గేర్ షిఫ్టర్, అక్కడక్కడా క్రోమ్ ఫినిషింగ్‌లను గమనించవచ్చు. ఈ కారులో ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్, స్టీరింగ్‌పై ఆడియో కంట్రోల్స్, ఎలక్ట్రిల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లను అందుబాటులో ఉంచే ఆస్కారం ఉంది.

అల్లాయ్ వీల్స్

అల్లాయ్ వీల్స్

గన్‌మెటల్ ఫినిష్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా లభ్యం కానున్నాయి.

ఇంజన్

ఇంజన్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుత వ్యాగన్ఆర్‌లో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. 2014లో కొత్త ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.

ధర

ధర

దీని ధర టాప్-ఎండ్ వేరియంట్ వ్యాగన్ఆర్ కన్నా సుమారు రూ.50,000 మేర అధికంగా ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
Easily the most awaited new car in the segment, the Wagon R Stingray could be revealed officially on tomorrow, if several reports are to be believed. The Stingray is a redesigned Wagon R that will be sold alongside the existing Wagon R tallboy.
Story first published: Tuesday, August 20, 2013, 12:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X