ఆగస్ట్ 20న మార్కెట్లోకి రానున్న మారుతి వ్యాగన్ఆర్‌ స్టింగ్‌రే!

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా అందిస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో, ఓ ప్రీమియం వెర్షన్‌ (వ్యాగన్ఆర్ స్టింగ్‌రే)ను కంపెనీ విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ అధునాతన స్టయిలిష్ వ్యాగన్ఆర్ స్టింగ్ ఆగస్ట్ 20వ తేదీన మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

జపనీస్ మార్కెట్లో అత్యంత పాపులారిటీని దక్కించుకున్న 'వ్యాగన్ఆర్ స్టింగ్‌రే' (Wagon R Stingray) మరికొద్ది రోడుల్లో భారత రోడ్లపై కూడా హల్ చల్ చేయనుంది. వ్యాగన్ఆర్ స్టింగ్‌రేను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ నిర్వహిస్తోంది. ఇటీవలే ఓ ఫొటోషూట్ సందర్భంగా బయటకు వచ్చిన స్పైషాట్స్ కూడా ఇంటర్నెట్‌లో సర్కిల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న వ్యాగన్ఆర్ కన్నా వ్యాగన్ఆర్ స్టింగ్‌రే మరింత ఆకర్షనీయమైన డిజైన్, విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండనుంది. ప్రస్తుత వ్యాగన్ఆర్‌కు ఎగువన ఈ కారును ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రీమియం స్పోర్టీ వెర్షన్ వ్యాగన్ఆర్ స్టింగ్‌రేకు సంబంధించిన మరింత సమాచారన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వ్యాగన్ఆర్ సక్సెస్..

వ్యాగన్ఆర్ సక్సెస్..

ప్రస్తుతం భారత మార్కెట్లో వ్యాగన్ఆర్ కార్లు ప్రతినెలా 16,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో, వ్యాగన్ఆర్ అమ్మకాలకు మరింత ఊతమిచ్చేందుకు ఇందులో ఆకర్షనీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు కలిగిన ఓ సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ఎక్స్టీరియర్ డిజైన్

ఎక్స్టీరియర్ డిజైన్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే, ప్రస్తుత వ్యాగన్ఆర్ కన్నా మరింత ఎక్కువ బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇది మంచి లుక్‌నిస్తుంది. ముందువైపు సన్నటి గ్రిల్, పెద్ద ఎయిర్‌ డ్యామ్‌తో కూడిన ఫ్రంట్ బంపర్, ఆకర్షనీయమైన హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, క్లియర్ గ్లాస్ టెయిల్ ల్యాంప్స్, రీస్టయిల్డ్ రియర్ బంపర్ వంటి ఫీచర్లను ఈ కొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రేలో గమనించవచ్చు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే ఇంటీరియర్స్ మరింత ప్రీమియంగా ఉండనున్నాయి. ఇది చూడటానికి మినీ వ్యాన్‌లా కనిపించినప్పటికీ, ఇందులో లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసిన సీటింగ్, విశాలమైన హెడ్‌రూమ్ అండ్ లెగ్‌రూమ్, వెనుక వరుసలో విశాలమైన సీట్లు ఉన్నాయి. అవసరం లేదనుకుంటే ఈ వెనుక సీట్లను మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం వాడుకోవచ్చు.

ఇంజన్

ఇంజన్

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కారులో 1 లీటర్, 3-సిలిండర్, కె సిరీస్ పెటోల్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67 హార్స్ పవర్‌ల శక్తిని, 90 న్యూటన్ మీటర్ల టార్కును ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

ప్రస్తుత వ్యాగన్ఆర్‌తో పాటే..

ప్రస్తుత వ్యాగన్ఆర్‌తో పాటే..

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం దేశీయ విపణిలో లభిస్తున్న వ్యాగన్ఆర్‌తో పాటుగానే ఈ కొత్త వ్యాగన్ఆర్ స్టింగ్‌రే కూడా లభ్యం కానుంది. అయితే, దీని ప్రీమియం ఫీచర్ల వలన ధర విషయంలో ఇది ప్రస్తుత వ్యాగన్ఆర్ కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
According to recent reports, Maruti Suzuki India is all set to launch the premium hatchback Stingray on 20th August in India. A Stingray was recently spotted during an official photoshoot, which suggests the launch date is very near.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X