మారుతి సుజుకి 'ఎక్స్ఏ ఆల్ఫా' గురించి మరిన్ని డిటేల్స్

By Ravi

దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ప్యాసింజర్ కార్లలో సక్సెస్‌ను సాధించినంతగా యుటిలిటీ వాహనాల్లో సక్సెస్‌ను సాధించలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం మారుతికి ఈ సెగ్మెంట్లో పటిష్టమైన మోడళ్లు లేకపోవటమే. అయితే, ఎమ్‌పివి విభాగంలో ఇటీవల మారుతి సుజుకి విడుదల చేసిన ఎర్టిగా ఎమ్‌పివితో కంపెనీ యుటిలిటీ వాహన సెగ్మెంట్లో కొత్త శకాన్ని ప్రారంభించింది. కానీ ఎస్‌యూవీ విభాగంలో మాత్రం, ఇతర మోడళ్లకు పోటీనిచ్చే సరైన ఎస్‌‍‌యూవీ మారుతి వద్ద లేదు.

ఈ నేపథ్యంలో, జనవరి 2012లో మారుతి సుజుకి విడుదల చేసిన తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఎక్స్ఏ ఆల్ఫా' కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఇండియన్ మార్కెట్ కోసం ఓ సరికొత్త మోడల్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. ఇది ఈ సెగ్మెంట్లో తాజాగా వచ్చిన రెనో డస్టర్, త్వరలో రానున్న ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లకు ధీటుగా నిలువనుంది. మారుతి సుజుకి ఇప్పటికే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని 'వైఏడి' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి ఆన్‌లైన్‌లో లీక్ అయిన సమాచారం మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ పాఠకుల కోసం..!

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి నుంచి రానున్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మాదిరిగా నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉండి, ప్రభుత్వం అందిస్తున్న ఎక్సైజ్ రాయితీలను పొందనుంది. దీనిపై కేవలం 12 శాతం ఎక్సైజ్ సుంఖం మాత్రమే వర్తించనుంది.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

ఇది 20014 చివరి నాటికి కానీ లేదా 2015 ఆరంభంలో కానీ మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

తొలుతగా ఇది డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది విడిఐ, జెడ్‌డిఐ, జెడ్‌డిఐ ప్లస్ అనే వేరియంట్లలో లభించనున్నట్లు సమాచారం.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

ఇది రెండు వరుసల సీట్లను కలిగి ఉండి, వెనుక వరుసలో సీట్లను 60:40 నిష్పత్తిలో మడిచుకునే సౌకర్యం ఉండనుంది.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

దీని ముందు సీట్లు మారుతి డిజైర్‌లోని సీట్ల మాదిరిగా ఉండనున్నాయి. జెడ్ వేరియంట్లలో ఆర్మ్‌రెస్ట్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి ఎక్స్ఏ ఆల్ఫా 4000 మి.మీ. పొడవును, 1900 మి.మీ. వెడల్పును, 1600 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. దీని సీటింగ్ కెపాసిటీ ఐదుగురు వ్యక్తులు.

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

మారుతి సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా

Most Read Articles

English summary
After the launch of EcoSport in India in a couple of months, the most awaited compact SUV will be Maruti’s XA-Alpha for sure. Through one of our sources we have got a few sneaking bits to share with all of you.
Story first published: Tuesday, April 23, 2013, 7:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X