మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్, తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కంపెనీ అందిస్తున్న 'మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి' (McLaren MP4- 12C)లో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎమ్‌పి4-12సి కూపే మరియు ఎమ్‌పి4-12సి స్పైడర్‌ మోడళ్లలో ఈ వార్షికోత్సవ ఎడిషన్లు లభ్యం కానున్నాయి.

తమ 50 ఏళ్ల చరిత్రకు గుర్తుగా కంపెనీ వీటిని 50 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయనుంది. రెగ్యులర్ వెర్షన్ కూప్, స్పైడర్ మోడళ్లతో పోల్చుకుంటే ఈ వార్షికోత్సవ ఎడిషన్లు మరిన్ని అధనపు హంగులను, ఫీచర్లను సొంతం చేసుకున్నాయి. మెక్‌లారెన్ స్పెషల్ ఆపరేషన్స్ (ఎమ్ఎస్ఓ) ఈ స్పెషల్ ఎడిషన్ మోడళ్లను అభివృద్ధి చేసింది. ఈ మార్పులు వినియోగదారులు కోరుకున్నట్లుగా ఉండనున్నాయి.

ఇంజన్ పరంగా ఈ మోడళ్లలో ఎలాంటి మార్పులు ఉండబోవు. మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి సూపర్‌కారులో 616 హెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే 3.8 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఎస్ఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. దీని వలన ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 328 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

హెచ్ఎస్ ఎడిషన్ మోడళ్ల నుంచి గ్రహించి రీడిజైన్ చేసిన ఫ్రంట్ ప్రొఫైల్, కార్ ఏరోడైనమిక్ సామర్థ్యాలను మరింత పెంచేలా కార్బన్ ఫైబర్, జిటి కార్ల నుంచి స్ఫూర్తి పొందిన కార్బన్ కెవ్లర్ ఎయిర్ స్ప్లిట్టర్స్ మరియు కొన్ని స్టయిల్ అప్‍‌డేట్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్లలో గమనించవచ్చు. మెక్‌లారెన్ 50 12సి కూపే ధర 1.96 లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.1.6 కోట్లు) గాను మెక్‌లారెన్ 50 12సి స్పైడర్ ధర 2.15 లక్షల యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.1.8 కోట్లు) గాను ఉన్నాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

కారు బానెట్‌పై ఎమ్ఎస్ఓ సిగ్నేచర్ ప్రతిబించేలా డిజైన్ చేసిన మెక్‌లారెన్ బ్యాడ్జ్.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

కారును మరింత సమర్థవంతంగా నిలిపేందుకు గాను కార్బన్ సెరామిక్ డిస్క్ బ్రేక్‌లను జోడించారు.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

ముందువైపు 19 ఇంచ్, వెనుకవైపు 20 ఇంచ్ ఆల్ట్రా లైట్ వెయిట్ అల్లాయ్ వీల్స్.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

కంపెనీ 50వ వార్షికోత్సవాన్ని గుర్తిచేసేలా ఏర్పాటు చేసిన మెక్‌లారెన్ 50 వార్షికోత్సవ బ్యాడ్జ్.

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ ఎమ్‌పి4-12సి 50వ వార్షికోత్సవ ఎడిషన్

మెక్‌లారెన్ 50 లిమిటెడ్ ఎడిషన్ కారు కార్బన్ బ్లాక్, సూపర్‌నోవా సిల్వర్ లేదా మెక్‌లారెన్ ఆరెంజ్ రంగులలో లభ్యమవుతుంది. కొనుగోలుదారులు స్పెషల్ ఎడిషన్ బ్లాక్ అండ్ సిల్వర్ కలర్‌ను ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
McLaren 50 12C and 5012C Spyder are limited edition models announced by the British automaker as part of its 50th anniversary celebrations. Availability will be limited to just 50 units each for the coupe and Spyder and will come with several enhancements made by the McLaren Special Operations (MSO) division.
Story first published: Friday, May 31, 2013, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X