మరింత శక్తివంతమైన, ఖరీదైన మెక్‌లారెన్ పి1 సూపర్‌కారు

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ తాజాగా ఓ సరికొత్త సూపర్‌కారు 'మెక్‌లారెన్ పి1'ను అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సూపర్‌కారును మార్చ్ 2013లో జరగనున్న 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది. ఈ నేపథ్యంలో మెక్‌లారెన్ పి1 సూపర్‌కారును అఫీషియల్ ఫోటోలను, కారుకు సంబంధించిన వివరాలను కంపెనీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీని ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.07 కోట్లు (పన్నులు కలుపుకోకుండా). ఈ కారును సాధారణ రోడ్లపై, అలాగే రేస్ ట్రాక్‌లపైనా నడుపుకోవచ్చు. ఇందులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 903 బిహెచ్‌పిల శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు. ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది. ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సూపర్‌కార్ల తయారీ కంపెనీ మెక్‌లారెన్ తాజాగా ఓ సరికొత్త సూపర్‌కారు 'మెక్‌లారెన్ పి1'ను అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త సూపర్‌కారును మార్చ్ 2013లో జరగనున్న 83వ జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచనుంది.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 3 సెకండ్ల కన్నా తక్కువ సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 7 సెకండ్ల లోపు 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 17 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1 ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.07 కోట్లు (పన్నులు కలుపుకోకుండా).

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1 కారులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 903 బిహెచ్‌పిల శక్తిని, 900 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది.

మెక్‌లారెన్ పి1

మెక్‌లారెన్ పి1

ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

Most Read Articles

English summary
McLaren has come out with the images of the production version of McLaren P1 hypercar, as well as the exciting performance details ahead of its public reveal at the Geneva Motor Show during the first week of March.
Story first published: Thursday, February 28, 2013, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X