తొలి కస్టమర్‌కి మెక్‌లారెన్ పి1 హైపర్‌కారు డెలివరీ

By Ravi

బ్రిటీష్ సూపర్‌కార్ కంపెనీ మెక్‌లారెన్ ఈ ఏడాది మార్చ్ నెలలో జరిగిన 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించి సరికొత్త 'మెక్‌లారెన్ పి1' (McLaren P1) సూపర్ హైబ్రిడ్‌కారు శరవేగంగా ఉత్పత్తి దశకు, అంతే వేగంగా కస్టమర్ల చెంతకు చేరిపోయింది. మెక్‌లారెన్ తాజాగా తమ తొలి పి1 కారును ఓ లక్కీ కస్టమర్‌కు డెలివరీ చేసింది.

మెక్‌లారెన్ ఈ నెల ఆరంభంలో తమ పి1 హైపర్ కారు ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసినదే. డ్యూయెల్ పవర్ (ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజన్)తో నడిచే ఈ హైపర్‌కారును కేవలం 375 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఒక్క రోజుకు కేవలం ఒక్క మెక్‌లారెన్ పి1 కారును మాత్రమే తయారు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, మెక్‌లారెన్ పి1 హైపర్ కారుకు సంబంధించిన అఫీషియల్ పెర్ఫామెన్స్ ఫిగర్స్‌ను కంపెనీ వెల్లడి చేసింది. మెక్‌లారెన్ పి1 హైపర్‌కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి.

ఫస్ట్ మోడల్

ఫస్ట్ మోడల్

తొలిసారిగా ఉత్పత్తి అయిన మెక్‌లారెన్ పి1 కారు వొల్కానో యల్లో కలర్ షేడ్‌లో తయారైంది. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ తొలి పి1 కారును సొంతం చేసుకున్నారు.

ఇంజన్

ఇంజన్

ఈ సూపర్ హైబ్రిడ్ కారులో శక్తివంతమైన 3.8 లీటర్, ట్విన్-టర్బో వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 737 హార్స్ పవర్‌ల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 179 హార్స్ పవర్‌ల శక్తిని, 260 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేసే ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా ఉపయోగించారు.

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)

ఈ ఇంజన్ 7-స్పీడ్ ట్విన్ క్లచ్ గ్రజియానో గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారులో రేస్ నుంచి స్ఫూర్తి పొందిన ఇన్‌స్టాంట్ పవర్ అసిస్ట్ సిస్టమ్ (ఐపిఏఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా ఇది కేవలం 2.8 సెకండ్ల సమయంలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని, 6.8 సెకండ్లలో 0-200 కి.మీ. గరిష్ట వేగాన్ని మరియు 16.5 సెకండ్లలో 0-300 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకోగలదు.

గరిష్ట వేగం

గరిష్ట వేగం

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 350 కి.మీ. పరిమితం చేశారు.

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

కేవలం 375 యూనిట్ల మాత్రమే ఉత్పత్తి

ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం కేవలం 375 యూనిట్ల మెక్‌లారెన్ పి1 సూపర్‌కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ధర

ధర

మెక్‌లారెన్ పి1 ధర 8.60 లక్షల బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7.07 కోట్లు (పన్నులు కలుపుకోకుండా).

టైర్లు

టైర్లు

మెక్‌లారెన్ పి1 సూపర్‌కారుకు ఉపయోగించిన పి జీరో కోర్సాస్ టైర్లను, కంపెనీ సాంకేతిక భాగస్వామి అయిన పీరెల్లీతో కలిసి అభివృద్ధి చేశారు.

బ్రేకింగ్ సిస్టమ్

బ్రేకింగ్ సిస్టమ్

ఈ కారులోని స్పెషల్ బ్రేకింగ్ సిస్టమ్‌ను మెక్‌లారెన్ ఫార్ములా 1 భాగస్వామి అకెబోనో అభివృద్ధి చేసింది.

మైలేజ్, ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

మైలేజ్, ఎలక్ట్రిక్ మోడ్ రేంజ్

ఇది లీటరుకు 12.04 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ కారులో ఉన్న మరొక విశిష్టమైన ఫీచర్ ఏంటంటే, ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై గంటకు 48 కి.మీ. గరిష్ట వేగం వద్ద సుమారు 20 కి.మీ. వరకూ ప్రయాణించగలదు.

Most Read Articles

English summary
It's official folks. The first production McLaren P1 has reached its customer and with it the British supercar maker has made public, for the first time, the official performance numbers of their hybrid hypercar.
Story first published: Wednesday, October 23, 2013, 9:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X