మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి దాదాపుగా అమ్ముడుపోయినట్లే!

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్స్ కార్ మెర్సిడెస్-ఏఎమ్‌జి జిటి మోడల్ 2015-16 సంవత్సరానికి గాను దాదాపుగా అమ్ముడుపోయినట్లు సమాచారం. ముందు వైపు ఇంజన్ కలిగిన ఈ స్పోర్ట్స్ కార్‌ను కంపెనీ దాదాపు రెండు నెలల క్రితం మార్కెట్లో విడుదల చేసింది.

రెండు ఏఎమ్‌జి జిటి మోడళ్లను సెప్టెంబర్ 9, 2014వ తేదీన కంపెనీ విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన ట్విన్-టర్బోచార్జ్డ్, ఎమ్178, 4-లీటర్, వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ఈ రెండు ఇంజన్లను విభిన్న పవర్‌లతో ట్యూనింగ్ చేశారు.

ఇందులో ఒక మోడల్ గరిష్టంగా 456 బిహెచ్‌పిల శక్తిని, 600 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవ మోడల్ గరిష్టంగా 503 బిహెచ్‌పిల శక్తిని, 650 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటాయి.

Mercedes AMG GT

ఈ స్పోర్ట్స్ కార్ కేవలం 3.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లు. ఈ కారును విడుదల చేసిన సమయంలో మెర్సిడెస్ ఏఎమ్‌జి సీఈఓ టోబియాస్ మోరెస్ మాట్లాడుతూ.. ఇందులో బ్లాక్ సిరీస్ వెర్షన్‌ను అలాగే జిటి3 రేసింగ్ మరియు స్ట్రీట్ వెర్షన్లను కూడా ఆఫర్ చేస్తామని ప్రామిస్ చేశారు.

ఈ సెగ్మెంట్లో ఇది నేరుగా పోర్షే 911 జిటి3 మోడల్‌కు పోటీగా నిలుస్తుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి మోడల్‌ను ఏఎమ్‌జి డైనమిక్ సెలక్ట్ ఫీచర్‌తో ఆఫర్ చేస్తున్నారు. అల్టిమేట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఇది అనేక రకాల ఆప్షన్లను ఆఫర్ చేస్తుంది.

Most Read Articles

English summary
German luxury car manufacturer, Mercedes-Benz has revealed that their latest flagship sports car, the Mercedes-AMG GT, is almost sold out for 2015-16. The front engined sports car from the German manufacturer, was launched hardly a couple of months ago and has managed to nearly sell out already.
Story first published: Saturday, November 1, 2014, 13:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X