మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్ విడుదల; ధర, వివరాలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఓ లిమిటెడ్ ఎడిషన్ సి-క్లాస్ కారును నేడు (నవంబర్ 12, 2013) భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

ఈ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి యూనిట్లకు పైగా సి-క్లాస్ కార్లను విక్రయించిన సందర్భాన్ని పురస్కరించుకొని మెర్సిడెస్ బెంజ్ ఇందులో ఓ సెలబ్రేషన్ ఎడిషన్‌ను భారత్‌లో కూడా విడుదల చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఇప్పటికే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లగ్జరీ సెలూన్‌ను కంపెనీ విక్రయిస్తోంది.

సెలబ్రేషన్ ఎడిషన్ పేరిట వచ్చిన ఈ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ లగ్జరీ కారు రెగ్యులర్ వేరియంట్‌తో పోల్చుకుంటే మరిన్ని అధనపు ఫీచర్లతో లభ్యం కానుంది. దీని ధర మరియు ఇతర వివరాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

అత్యంత పాపులర్ అయిన సి 220 సిడిఐ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్ తయారు చేశారు. భారత మార్కెట్లో కేవలం 500 యూనిట్ల సెలబ్రేషన్ ఎడిషన్ సి-క్లాస్ కార్లను మాత్రమే విక్రయించనున్నారు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

ఈ స్పెషల్ ఎడిషన్‌కు ఏఎమ్‌జి కిట్‌ను జోడించారు. ఇందులో భాగంగా కొత్త బంపర్స్, సైడ్ స్కర్ట్స్, స్మోక్డ్ ల్యాంప్స్, 5-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి కాస్మోటిక్ మార్పులతో సి-క్లాస్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

సి 220 సిడిఐ వేరియంట్‌కు ఏఎమ్‌జి కిట్‌ను జోడించటం వలన ఇది రెగ్యులర్ వెర్షన్ సి-క్లాస్ కన్నా భిన్నంగా కనిపించడమే కాకుండా, దీనికి సి63 ఏఎమ్‌జి వంటి లుక్‌నిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, బ్లూ కలర్ దారంతో కుట్టిన ఆల్కాంట్రా లెథర్ సీట్స్, ఇంటీరియర్లపై సిల్వర్ ఫినిషింగ్, ఫుల్ కలర్ ఎల్ఈడి డిస్‌ప్లే వంటి మార్పులు చేర్పులు ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

సెలబ్రేషన్ ఎడిషన్ సి-క్లాస్‌లో యాంత్రిక పరంగా ఎలాంటి మార్పులు లేవు. సి 220 సిడిఐలో ఉపయోగించిన 2143సీసీ ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు. ఇది 170 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్ ధర 39.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా నిర్ణయించారు.

Most Read Articles

English summary
Mercedes Benz India has just lunched the new C-Class Celebration Edition at Rs. 39.16 lakh (ex-showroom, Mumbai). Only 500 units of Mercedes Benz C-Class Celebration Edition will be available in Indian Market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X