భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ ఈ-క్లాస్‌లో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ పేరుతో లభ్యం కానున్న ఈ వేరియంట్ ఇదివరకటి ఈ-క్లాస్ వేరియంట్ల కన్నా మరింత శక్తివంతమైనది. ఇందులో పవర్‌ఫుల్ 3.0 లీటర్, వి6 బై-టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

భారత మార్కెట్లో కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ వేరియంట్ ఈ 350 సిడిఐ ధర రూ.57.42 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ వేరియంట్‌ను పూనేలోని మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటికే ఈ-క్లాస్‌లో ఈ200 సిజిఐ, ఈ250 సిడిఐ మరియు ఈ63 ఏఎమ్‌జి మోడళ్లను విక్రయిస్తోంది. కొత్త వేరియంట్ చేరికతో మొత్తం ఈ-క్లాస్ వేరియంట్ల సంఖ్య నాలుగుకి చేరుకుంది.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్‌లో లభించే ఫీచర్లు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్

తర్వాతి స్లైడ్‌లలో కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

ఇంజన్, ట్రాన్సిమిషన్, పవర్, పెర్ఫార్మెన్స్

ఇంజన్, ట్రాన్సిమిషన్, పవర్, పెర్ఫార్మెన్స్

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్‌‌లో 3.0 లీటర్, వి6 బై-టర్బో ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3,400 ఆర్‌పిఎమ్ వద్ద 262 బిహెచ్‌పిల శక్తిని, 1,600-2,400 ఆర్‌పిఎమ్ వద్ద 620 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ 7జి-ట్రానిక్ ప్లస్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

ఇది కేవలం 6.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

ఎక్స్టీరియర్

ఎక్స్టీరియర్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఈ-క్లాస్ డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్‌ను డిజైన్ చేశారు. సరికొత్త ఫ్రంట్ డిజైన్‌తో ఇది సుపీరియర్, రీఫైన్డ్ అండ్ స్పోర్టీ అప్పీరెన్స్‌ను కలిగి ఉంటుంది. కొత్త గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి రన్నింగ్ లైట్స్, టెయిల్ ల్యాంప్స్, 17 ఇంచ్ మల్టీ స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్ ఇందులో చూడొచ్చు.

ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్

ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐలోని ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్ ఓ సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని కల్పిస్తుంది. అధునాతన టెక్నాలజీని కలగలపి రూపొందించిన ఈ సిస్టమ్‌లో ఈకో స్టార్ట్-స్టాప్ ఫంక్షన్, ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్, అడాప్టివ్ హైబీమ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా, అటెన్షన్ అసిస్ట్, కమాండ్ ఆన్‌లైన్, టైర్ ప్రెజల్ లాస్ వార్నింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లున్నాయి.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

కొత్త ఈ 350 సిడిఐ వేరియంట్ ఇంటీరియర్స్‌ను అత్యంత నాణ్యమైన మెటీరియల్స్‌తో డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డుపై హై గ్లాస్ బ్లాక్ యాష్ ఉడ్ ట్రిమ్, హై-క్వాలిటీ సిల్వర్ క్రోమ్ ఫ్రేమ్, యాంబీంట్ లైటింగ్, మెమరీ సీట్స్, ప్రీమియం ఆర్టికో లెథర్ సీట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్, 17.8 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఇంటర్నెట్, యూఎస్‌బి, బ్లూటూత్ కనెక్టివిటీ మొదలైన ఫీచర్లున్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్‌లో 8 ఎయిర్‌బ్యాగ్స్, యాక్సిలరేషన్ స్కిడ్ కంట్రోల్ (ఏఎస్ఆర్), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), బ్రేక్ అసిస్ట్ (బిఏ) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా మెర్సిడెస్ బెంజ్ ఆప్టిమైజ్డ్ సిస్టమ్స్ అయిన ప్రీ-సేఫ్ టెక్నాలజీ, నెక్ ప్రో, అటెన్షన్ అసిస్ట్ వంటి పలు సేఫ్టీ ఫీచర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు.

కన్వీనెన్స్ ఫీచర్స్

కన్వీనెన్స్ ఫీచర్స్

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐలో పెద్ద పానరోమిక్ సన్‌రూఫ్, ఇంటిగ్రేటెడ్ పార్క్‌ట్రానిక్‌తో కూడిన యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరాలు, యాక్టివ్ స్టీరింగ్ ఇంటర్వెన్షన్, ఫుల్ సైజ్ స్పేర్ వీల్, 540 లీటర్ బూట్ స్పేస్ వంటి కన్వీనెన్స్ ఫీచర్లున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్

17 ఇంచ్ మల్టీ స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్

540 లీటర్ బూట్ స్పేస్

మెర్సిడెస్ బెంజ్ ఈ 350 సిడిఐ వేరియంట్

సౌకర్యవంతమైన సీట్స్ మరియు విశాలవంతమైన ఇంటీరియర్ స్పేస్.

Most Read Articles

English summary
Following its ‘Top of Pyramid’ product strategy for the Indian customer, Mercedes-Benz India today launched the highly anticipated; ‘Intelligent Superpower’ the E 350 CDI at its Pune plant.
Story first published: Thursday, September 11, 2014, 17:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X