జులైలో రానున్న మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన చిన్న కారు 'బి-క్లాస్'లో డీజిల్ వెర్షన్‌ను ఈ ఏడాది జులై నెలలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ స్పోర్ట్స్ టూరర్ బి 180, బి180 స్పోర్ట్ అనే రెండు వేరియంట్లలో కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. బి-క్లాస్ డీజిల్ వెర్షన్‌ను కూడా కంపెనీ సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఛాకన్ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయనుంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ డీజిల్ వెర్షన్‌లో 1796సీసీ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 6-స్పీడ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్)తో లభ్యమయ్యే ఆస్కారం ఉంది. ఇది కూడా బి180 సిడిఐ, బి200 సిడిఐ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. బి180 సిడిఐ ఇంజన్ గరిష్టంగా 109 పిఎస్‌ల శక్తినని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బి200 సిడిఐ ఇంజన్ గరిష్టంగా 136 పిఎస్‌ల శక్తినని, 300 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్


ఎమ్‌యూవీ (మల్టీ యుటిలిటీ వెహిలక్)లోని సౌకర్యాన్ని, సెడాన్‌లోని రైడ్ క్వాలిటీని మరియు ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లోని పెర్ఫామెన్స్‌లను కలగలపి మెర్సిడెస్ బెంజ్ తమ బి-క్లాస్ కారును తీర్చిదిద్దింది. ప్రస్తుతం లభిస్తున్న పెట్రోల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ కారులో ఉపయోగించిన 1.6 లీటర్ (1595సీసీ) 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 122 హెచ్‌పిల శక్తిని,200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 10.2 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కి.మీ.

Most Read Articles

English summary
German luxury carmaker Mercedes Benz will launch B-Class diesel in July 2013. The diesel B-Class will be powered by a 1,796 cc common-rail diesel engine, mated to either a six-speed manual transmission, or a 7-speed DCT (dual clutch transmission).
Story first published: Tuesday, March 19, 2013, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X