కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ విడుదల; ధర రూ.40.90 లక్షలు

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సెడెస్ బెంజ్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ సి-క్లాస్‌లో నేడు (నవంబర్ 25, 2014) ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ధర రూ.40.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2014 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ప్రస్తుతానికి కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఇందులో డీజిల్ వెర్షన్‌ను విడుదల చేసే ఆస్కారం ఉంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పాపులర్ లగ్జరీ కార్ ఎస్-క్లాస్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది కొత్త 2014 సి-క్లాస్‌ను డిజైన్ చేశారు.


మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ సి 200 పెట్రోల్ వేరియంట్‌లో పవర్‌ఫుల్ 2.0 లీటర్, ఫోర్-సిలిండర్, టర్చోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 135 కి.వా. శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7జి-ట్రానిక్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. మ్యాన్యువల్‌గా గేర్లను మార్చుకునేందుకు స్టీరింగ్ వీల్‌పై ప్యాడల్ షిఫ్టర్స్ ఉంటాయి.

ఈ కారు కేవలం 7.3 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇందులో కంఫర్ట్, ఎకానమీ, స్పోర్ట్, స్పోర్ట్+ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ కొత్త సి-క్లాస్ కారును కొత్త లైట్‌వెయిట్ మాడ్యులర్ రియర్-డ్రైవ్ ఎమ్ఆర్ఏ (మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ కన్నా తేలికగా ఉంటుంది.

అడాప్టివ్ మెయిన్ బీమ్ అసిస్ట్ ప్లస్‌తో కూడిన ఫుల్ ఎల్ఈడి ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్‌ను ఈ కారులో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుంది. ఫలితంగా, ఇందులో ఇంటీరియర్ స్పేస్ అధికంగా ఉంటుంది.

New Mercedes Benz C Class Launched

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మొత్తం 4686 మి.మీ. పొడవును 1810 మి.మీ. వెడల్పును మరియు 1442 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ప్రస్తుత వెర్షన్ సి-క్లాస్‌తో పోల్చి చూస్తే ఇది 95 మి.మీ. ఎక్కువ పొడవును, 40 మి.మీ. ఎక్కువ వెడల్పును మరియు 5 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త సి-క్లాస్ వీల్‌బేస్ 2840 మి.మీ., మునుపటి వెర్షన్ కన్నా ఇది 80 మి.మీ. అధికం.

ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్స్, ప్రీ-సేఫ్, అటెన్షన్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఈఎస్‌పి, ఏఎస్ఆర్, బిఏఎస్, ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి. మెర్సిడెస్‌కు సి-క్లాస్ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఇండియాలో ఇప్పటి వరకూ 20,000 యూనిట్లకు పైగా సి-క్లాస్ కార్లు అమ్ముడుపోయాయి.

Most Read Articles

English summary
Mercedes Benz India has launched the new C-class at Rs 40.90 lakh (ex-showroom, Delhi). The new 2014 Mercedes Benz C-Class is now only available petrol trim, the diesel variant will be available in early 2015.
Story first published: Tuesday, November 25, 2014, 14:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X