రూ.21 లక్షలు తగ్గిన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500 ధర

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన '2014 ఎస్-క్లాస్ ఎస్ 500' మోడల్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఈ కారుపై ఏకంగా రూ.21 లక్షల ధరను తగ్గిస్తున్నామని కంపెనీ ప్రకటించింది.

మెర్సిడెస్ బెంజ్ జనవరిలో ఈ సరికొత్త 2014 ఎస్-క్లాస్ ఎస్ 500 లగ్జరీ కారును రూ.1.57 కోట్ల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధరతో విడుదల చేసింది. కాగా.. ఇప్పుడు ఈ మోడల్‌ను పుణేకి సమీపంలోని చాకన్ ప్లాంట్‌లో అసెంబుల్ చేయడం ప్రారంభించామని, అందుకే దీని ధరను తగ్గిస్తున్నామని మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇబెర్‌హర్డ్ కెర్న్ తెలిపారు.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌‌కు భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో, ఈ కారు అసెంబ్లింగ్‌ను అనుకున్న గడువు కన్నా మూడు నెలల ముందే ప్రారంభిస్తున్నామని, దీని తయారీలో స్థానిక విడిభాగాలను 40 శాతం వరకూ ఉపయోగిస్తున్నామని, ఈ మోడల్‌ను స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తుండటం వలన సుంకాలు తగ్గుతుండటంతో ఈ కారు ధరను తగ్గించామని ఆయన వివరించారు.

ధర తగ్గింపు తర్వాత ప్రస్తుతం దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500 ధర రూ.1.36 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కారును విడుదల చేసిన 16 రోజుల్లోనే 125 బుకింగ్స్ వచ్చాయని, వచ్చే జూన్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని ఇబెర్‌హర్డ్ కెర్న్ వివరించారు. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఎస్-క్లాస్, ఈ-క్లాస్, సి-క్లాస్, జిఎల్-క్లాస్, ఎమ్-క్లాస్, బి-క్లాస్ కార్లను అసెంబుల్ చేస్తోంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 కారులో 4.5 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 453 బిహెచ్‌పిల శక్తిని, 700 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500

ఇండియన్ వెర్షన్ ఎస్ 500లో మెర్సిడెస్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ లేదు. కాబట్టి, ఇందులో సెవన్ స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ట్రాన్సిమిషన్ ద్వారా ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500

మెర్సిడెస్ బెంజ్ ఎస్ 500 గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇది కేవలం 5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500

కొత్త ఎస్-క్లాస్ కారులో 24 స్పీకర్ల బ్రమెస్టర్ 3డి ఆడియో సిస్టమ్, రిక్లైయినింగ్ హీటెడ్ అండ్ కూల్డ్ సీట్స్ విత్ హాట్ స్టోన్ మసాజ్ ఫంక్షన్స్, చార్జింగ్ స్టేషన్స్, బ్లూటూత్ అండ్ వైఫై హాట్‌స్పాట్, ఫుల్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్, నైట్ విజన్ అసిస్ట్, యాక్టివ్ రైడ్ కంట్రల్, క్రూయిజ్ కంట్రోల్, పానరోమిక్ సన్‌రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు లభ్యం కానున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్500

మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ కారును కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ ఉచిత శిక్షణను అందించనుంది. ఇందులో భాగంగా, ఎస్-క్లాస్ కారులోని వివిధ ఫీచర్లను ఎలా ఉపయోగించుకోవాలో కస్టమర్లకు తెలియజేస్తారు.

Most Read Articles

English summary
Mercedes-Benz has began local production of the S-Class luxury sedan in India at its Chakan facility in Pune. The move comes following growing demand for the top of the line S500 petrol trim that's sold here, waiting period for which has reached 3 months.
Story first published: Friday, March 14, 2014, 10:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X