డిసెంబర్ 2న మెర్సిడెస్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి విడుదల

By Ravi

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా నిన్న భారత మార్కెట్లో తమ సరికొత్త 2014 కన్వర్టిబల్ కారు 'జెడ్4'ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కారుకు పోటీగా మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా వచ్చే నెలలో ఓ సరికొత్త కన్వర్టిబల్ కారు 'ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి'ను విడుదల చేయనుంది.

రెండు రోజుల క్రితమే సి-క్లాస్ సెలబ్రేషన్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్, తాజాగా 2014 ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ పెర్ఫామెన్స్ డివిజన్ అయిన ఏఎమ్‌జి టచ్‌తో వస్తున్న కొత్త ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కన్వర్టిబల్ కారు మరింత స్పోర్టీ అప్పీల్‌ను కలిగి ఉండనుంది.


కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కారులో 5.5 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా ఎలాంటి టర్బో చార్జర్ల సాయం లేకుండానే 421 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హార్డ్ టాప్ రూఫ్ లేకుండా ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి 4.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కొత్త ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు. ఇందులో ఉపయోగించిన ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ 7జి-ట్రానిక్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ద్వారా ఇంజన్ నుంచి ఉత్పత్తి శక్తిని వెనుక చక్రాలకు బదిలీ చేయబడుతుంది (రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్).

SLK 55 AMG

అన్ని ఏఎమ్‌జి మోడళ్ల మాదిరిగా ఈ కొత్త ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కూడా స్పోర్టీ బాడీ కిట్‌తో లభ్యం కానుంది. ఇందులో ఫ్రంట్ ఎయిర్ స్ప్లిట్టర్స్, సైడ్ స్కర్ట్స్, రియర్ డిఫ్యూజర్ వంటి ఫీచర్లను జోడించనున్నారు. వేగంగా కూల్ అయ్యేలా పెద్ద బ్రేక్స్‌ను ఉపయోగించారు. మరింత ధృడమైన సస్పెన్షన్ కోసం ఏఎమ్‌జి సస్పెన్షన్‌ను ఉపయోగించారు.

ఇంకా ఇందులో టార్క్ వెక్టరింగ్ బ్రేక్, ఏఎమ్‌జి డైరెక్ట్ స్టీర్, పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, నప్పా లెథర్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. చివరిగా.. ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కంట్రోల్డ్ ఎఫీషియన్సీ, స్పోర్ట్, మ్యాన్యువల్ అనే డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభించే ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది.

Most Read Articles

English summary
Mercedes Benz is clearly not holding back. The German automaker is determined to dominate the Indian performance and luxury car scene with the launch of one car after another. Following the launch of the C-Class Celebration Edition the automaker will next be bringing the SLK 55 AMG.
Story first published: Friday, November 15, 2013, 17:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X