మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి విడుదల: ధర, ఫీచర్లు

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ మెర్సిడెస్ బెంజ్ ఈనెల 2వ తేదీన తమ సరికొత్త కన్వర్టిబల్ కారు '2014 స్ఎల్‌కె 55 ఏఎమ్‌జి'ని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేడు (డిసెంబర్ 2, 2013) తమ పాపులర్ 'ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి' కన్వర్టిబల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

రెగ్యులర్ ఎస్ఎల్‌కె రోడ్‌స్టర్‌కు స్పోర్టీయర్ వెర్షనే ఈ కొత్త ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి. మరో జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ సరికొత్త 2014 కన్వర్టిబల్ కారు 'జెడ్4'కు పోటీగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ సరికొత్త కన్వర్టిబల్ కారు 'ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి'ను ప్రవేశపెట్టింది. ఈ కారుకు సంబంధించిన ధర మరియు ఇతర వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

మెర్సిడెస్ బెంజ్ పెర్ఫామెన్స్ డివిజన్ అయిన ఏఎమ్‌జి టచ్‌తో వస్తున్న ఈ కొత్త ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కన్వర్టిబల్ కారు రెగ్యులర్ ఎస్ఎల్‌కె రోడ్‌స్టర్ వెర్షన్ కన్నా మరింత స్పోర్టీ అప్పీల్‌ను కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కారులో 5.5 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా ఎలాంటి టర్బో చార్జర్ల సాయం లేకుండానే 421 హార్స్ పవర్‌ల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

ఈ ఇంజన్ ఏఎమ్‌జి స్పీడ్‌షిఫ్ట్ 7జి-ట్రానిక్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుంచి ఉత్పత్తి శక్తిని వెనుక చక్రాలకు బదిలీ చేస్తుంది (రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్).

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి 4.6 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

అన్ని ఏఎమ్‌జి మోడళ్ల మాదిరిగా ఈ కొత్త ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కూడా స్పోర్టీ బాడీ కిట్‌తో లభ్యం కానుంది. ఇందులో ఫ్రంట్ ఎయిర్ స్ప్లిట్టర్స్, సైడ్ స్కర్ట్స్, రియర్ డిఫ్యూజర్ వంటి ఫీచర్లను జోడించనున్నారు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

వేగంగా కూల్ అయ్యేలా పెద్ద బ్రేక్స్‌ను ఉపయోగించారు. మరింత ధృడమైన సస్పెన్షన్ కోసం ఏఎమ్‌జి సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో టార్క్ వెక్టరింగ్ బ్రేక్, ఏఎమ్‌జి డైరెక్ట్ స్టీర్, పెద్ద 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, నప్పా లెథర్ ఇంటీరియర్స్ వంటి ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి కంట్రోల్డ్ ఎఫీషియన్సీ, స్పోర్ట్, మ్యాన్యువల్ అనే డ్రైవింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో లభించే ఎస్‌ఎల్‌కె 55 ఏఎమ్‌జి మెరుగైన మైలేజీని ఆఫర్ చేయనుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి

భారత మార్కెట్లో 2014 మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్‌కె 55 ఏఎమ్‌జి ధర రూ.1.25 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Mercedes-Benz has launched yet another AMG variant of its model in India. This time its the SLK 55 AMG, the sportier version of the regular SLK roadster. Mercedes has priced the AMG convertible at INR 1,25,90,000, ex-showroom, Delhi.
Story first published: Monday, December 2, 2013, 14:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X