కొత్త 2014 మహీంద్రా జైలో విడుదల; ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

By Ravi

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) భారత మార్కెట్లో విక్రయిస్తున్న బహుళ ప్రయోజన వాహనం (మల్టీ పర్సస్ వెహికల్) 'మహీంద్రా జైలో' (Mahindra Xylo)లో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సైలెంట్‌గా మార్కెట్లో విడుదల చేసింది. గడచిన 2012వ సంవత్సరంలో మహీంద్రా తమ జైలో ఎమ్‌పివిలో ఫుల్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

అయితే, జైలో అమ్మకాలు క్రమంగా తగ్గముఖ పడుతుండటంతో, కంపెనీలో ఇందులో తాజాగా మరోసారి ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త 2014 మహీంద్రా జైలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ బేసిక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, కొద్దిపాటి కాస్మోటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. మరి ఈ కొత్త మహీంద్రా జైలో ఎమ్‌‌పివిలో కంపెనీ చేసిన మార్పులు ఏంటో, ఇందులోని కొత్త ఫీచర్లేంటో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2014 మహీంద్రా జైలో విడుదల

తర్వాతి స్లైడ్‌లలో 2014 మహీంద్రా జైలో ఎమ్‌పివికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

2014 మహీంద్రా జైలో విడుదల

కొత్త మహీంద్రా జైలోకు మరింత ప్రీమియం అప్పీల్‌నిచ్చేందుకు గాను కారు ముందు భాగంలో బానెట్ మరియు టెయిల్ గేట్ వద్ద క్రోమ్ గార్నిష్ చేశారు.

2014 మహీంద్రా జైలో విడుదల

జైలోకు ఫ్రెష్ లుక్‌ని తెచ్చేందుకు గాను బయటివైపు కొత్తగా బాడీ గ్రాఫిక్స్‌ను జోడించారు. ఇది జైలో ఓవరాల్ లుక్‌ని మరింత పెంచడంలో సహకరిస్తుంది.

2014 మహీంద్రా జైలో విడుదల

2014 మహీంద్రా జైలో ఎమ్‌పివిలో డ్యాష్‌బోర్డ్‌ను రీడిజైన్ చేశారు. బీజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌తో దీనిని డిజైన్ చేశారు. సెంటర్ కన్సోల్ కూడా కొత్తగా అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డుపై డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

2014 మహీంద్రా జైలో విడుదల

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా రీడిజైన్ చేశారు. ఆర్‌పిఎమ్, స్పీడోమీటర్, ఫ్యూయెల్ ఇండికేటర్, ఇంజన్ హీట్ ఇండికేటర్లు అనలాగ్ మీటర్లను కలిగి ఉంటాయి. ఇందులో చిన్నపాటి డిజిటల్ డిస్‌ప్లే కూడా ఉంటుంది.

2014 మహీంద్రా జైలో విడుదల

సిడి, ఎమ్‌పి3, ఆక్స్-ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 2-డిన్ ఆడియో సిస్టమ్‌ను కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

2014 మహీంద్రా జైలో విడుదల

కొత్త జైలో ఎమ్‌పివిలో బీజ్ కలర్ సీట్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కారుకు మరింత ప్రీమియం లుక్‌నిస్తాయి.

2014 మహీంద్రా జైలో విడుదల

మహీంద్రా జైలోలోని స్టీరింగ్ వీల్‌పై ఆడియో, టెలిఫోన్ కంట్రోల్స్‌తో పాటుగా పలు ఇతర కంట్రోల్స్ కూడా ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ జైలోలో వాయిస్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి కంట్రోల్ బటన్స్‌ను స్టీరింగ్ వీల్‌పై ఏర్పాటు చేశారు.

2014 మహీంద్రా జైలో విడుదల

కొత్త మహీంద్రా జైలోలో సరౌండ్ కూల్ డ్యూయెల్ విత్ ఇండివిడ్యువల్ ఏసి వెంట్స్‌ను ఏర్పాటు చేశారు.

2014 మహీంద్రా జైలో విడుదల

కొత్త మహీంద్రా జైలో సస్పెన్షన్‌లో మార్పులు చేశారు. మహీంద్రా కంఫర్ట్ సస్పెన్షన్‌గా పిలిచే ఈ సస్పెన్షన్ వలన దీనిలో ప్రయాణం మరింత సౌకర్యంగా అనిపిస్తుందని కంపెనీ పేర్కొంది.

2014 మహీంద్రా జైలో విడుదల

ఎమ్-హాక్ డీజిల్ ఇంజన్‌ను 2014 మహీంద్రా జైలోలో ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 120 పిఎస్‌ల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 8 మంది ప్రయాణీకులతో ప్రయాణించే పెర్ఫార్మెన్స్ తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

2014 మహీంద్రా జైలో విడుదల

చిన్నపాటి వస్తువులను స్టోర్ చేసుకునేందుకు డ్రైవ్ సీట్ క్రింది భాగంలో స్టోరేజ్ ట్రేని అందిస్తున్నారు.

2014 మహీంద్రా జైలో విడుదల

అలాగే, కారు లోపల ముందు వైపు క్యాబిన్ లైట్‌కు దిగువన చిన్నపాటి స్టోరేజ్ స్పేస్ ఉంది. ఇందులో కూలింగ్ గ్లాసెస్ వంటి వాటిని స్టోర్ చేసుకోవచ్చు.

2014 మహీంద్రా జైలో విడుదల

2014 మహీంద్రా జైలో 7-సీటర్, 8-సీటర్ మరియు 9-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది.

2014 మహీంద్రా జైలో విడుదల

కొత్త 2014 మహీంద్రా జైలో ధరలు రూ.7.24 లక్షల నుంచి రూ.7.84 లక్షల రేంజ్‌లోను (బిఎస్ 3 వెర్షన్ ధరలు) మరియు రూ.7.37 లక్షల నుంచి రూ.10.5 లక్షల రేంజ్‌లోను (బిఎస్4 వెర్షన్ ధరలు) ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ముంబై).

Most Read Articles

English summary
Mahindra and Mahindra has launched the new 2014 Xylo in India. The updated version Mahindra Xylo has been priced at Rs 7.25 lakh (ex-showroom, Mumbai).
Story first published: Thursday, September 25, 2014, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X