జులై 15న సరికొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ లాంచ్

By Ravi

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న 'పోలో' హ్యాచ్‌బ్యాక్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను జులై నెలలో విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ విడుదల చేదీని ఖరారు చేసింది. ఈనెల (జులై) 15వ తేదీన న్యూఢిల్లీ నిర్వహించబోయే ఓ కార్యక్రమంలో తమ 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈమేరకు మీడియాకు ఆహ్వానాలు కూడా పంపించింది.

మునుపటి వెర్షన్ పోలోతో పోల్చుకుంటే కొద్దిపాటి కాస్మోటిక్, ఫీచర్ అప్‌డేట్స్‌తో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ పోలోను అప్‌గ్రేడ్ చేశారు. కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో కొత్త లుక్, కొత్త ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్లను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇందులోకొత్త బంపర్, హెడ్‌ల్యాంప్స్, ఆప్షనల్ ఈఎల్‌డి లైట్స్, ఫాగ్ ల్యాంప్స్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముందువైపు లైట్‌గా క్రోమ్ టచ్, వెనుక వైపు కొత్త టెయిల్ లైట్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ వంటి కాస్మోటిక్ మార్పులు చాలానే ఉన్నాయి.

New 2014 Volkswagen Polo

ఇంటీరియర్స్‌లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ఇండియన్ వెర్షన్ పోలో కారులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.6 లీటర్ ఇంజన్‌కు బదులుగా 1.5 లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ పరిమాణం చిన్నదైనప్పటికీ, ఇది 1.6 లీటర్ ఇంజన్ మాదిరిగానే 105 హెచ్‌పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాక్స్ తగ్గించుకునేదుకు ఫోక్స్‌వ్యాగన్ ఈ ఇంజన్ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Volkswagen India is all set to launch the much awaited 2014 Polo facelift on 15th of July in Delhi. Volkswagen India has already sent media invite to us in this regard.
Story first published: Wednesday, July 2, 2014, 15:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X