సరికొత్త బుగాటి వేరాన్‌లో 1500 హార్స్‌పవర్ ఇంజన్!

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే బుగాటి వేరాన్ ఈసారి మరింత శక్తివంతమైన ఇంజన్‌తో రాబోతోంది. దాదాపు పదేళ్లుగా ఈ స్థానంలో కొనసాగిన బుగాటి వేరాన్, తన స్థానానికి ఎసరు పెట్టేందుకు వస్తున్న పోటీదారులకు చెక్ పెట్టేందుకు మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌తో మరింత వేగంగా పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బుగాటి వేరాన్‌లో 1200 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, భవిష్యత్తులో ఈ పవర్‌ను 1500 హార్స్‌పవర్‌లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. ఇంజన్ పవర్‌ను పెంచడం వలన పవర్ టూ వెయిట్ రేషియో, యాక్సిలరేషన్ (పెర్ఫార్మెన్స్) ఫిగర్స్, టాప్ స్పీడ్ మొదలైనవి మారే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బుగాటి వేరాన్

తర్వాతి స్లైడ్‌లలో పవర్‌ఫుల్ బుగాటి వేరాన్‌కు సంబంధించిన మరింత సమచారాన్ని తెలుసుకోండి.

బుగాటి వేరాన్

బుగాటి నుంచి రానున్న సరికొత్త వేరాన్‌లో కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఇలా చేయటం వలన ఇంజన్ పవర్‌ను 1500 హార్స్‌పవర్‌కు తీసుకువెళ్లవచ్చు.

బుగాటి వేరాన్

ఇప్పటికే అనేక సూపర్‌కార్ తయారీ సంస్థలు హైబ్రిడ్ బాట పట్టిన సంగతి తెలిసినదే. ఫెరారీ, పోర్షే, మెక్‌లారెన్ వంటి సంస్థలు హైబ్రిడ్ సూపర్ కార్లను తయారు చేసి కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

బుగాటి వేరాన్

బుగాటి నుంచి కొత్తగా రానున్న ఈ హైపర్ కారు ప్రస్తుత వేరాన్ సూపర్ స్పోర్ట్ గరిష్ట వేగం గంటకు 431 కిలోమీటర్లను అధిగమించగలదని అంచనా. అయితే, కారు ఏరోడైనమిక్స్‌లో తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది.

బుగాటి వేరాన్

ఒకవేళ ఫోక్స్‌వ్యాగన్ (బుగాటి సంస్థ యజమాని) తమ వేరాన్‌కు అధి టాప్ స్పీడ్‌ను అందించగలిగితే, తిరిగి ఇదే మోడల్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారుగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

బుగాటి వేరాన్ సూపర్‌స్పోర్ట్ గురించి..

బుగాటి వేరాన్ సూపర్‌స్పోర్ట్ గురించి..

ఇంజన్: 8.0 లీటర్, డబ్ల్యూ16-సిలిండర్, 64 వాల్వ్స్

పవర్: 1,200 పిఎస్ @ 6500 ఆర్‌పిఎమ్

టార్క్: 1,500 ఎన్ఎమ్ @ 3000-5000 ఆర్‌పిఎమ్

డ్రైవ్: ఫోర్-వీల్ (ఆల్-వీల్) డ్రైవ్

గేర్‌బాక్స్: 7-స్పీడ్ ఆటోమేటిక్

మైలేజ్: 4.33 కెఎమ్‌పిఎల్

Most Read Articles

English summary
The Bugatti Veyron has been the one car whose wow factor hasn't diminished over the almost 10 years of its existence. However, industry sources now say the Veyron is to get even more power, from the current 1,200 horsepower up to around 1,500!
Story first published: Monday, July 14, 2014, 20:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X