జనవరి 2015లో విడుదల కానున్న కొత్త కార్లు

By Ravi

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త సంవత్సరంలో కొత్త కార్లు క్యూ కట్టనున్నాయి. ఈ ఏడాది కొన్ని సరికొత్త కార్లు కస్టమర్లను ఆకట్టుకునేందుకు రానున్నాయి. ఇందులో భాగంగా, జనవరి 2015లో మొత్తం నాలుగు కొత్త మోడళ్లు మార్కెట్లో విడుదల కానున్నాయి.

మిశ్రమ స్పందనతో 2014వ సంవత్సరాన్ని ముగించిన కార్ మేకర్లు, 2015వ సంవత్సరంలో నైనా బలమైన వృద్ధిని సాధించాలనే వ్యూహారచనలు చేస్తున్నాయి. ఈ జనవరిలో విడుదల కానున్న సరికొత్త మోడళ్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

జనవరిలో విడుదల కానున్న కార్లు

తర్వాతి స్లైడ్‌లలో జనవరి 2015లో విడుదల కానున్న కొత్త కార్ల గురించి తెలుసుకోండి.

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ గో ప్లస్

డాట్సన్ బ్రాండ్ నుంచి రానున్న రెండ మోడల్ గో ప్లస్ ఎమ్‌పివి. జనవరి 15, 2014వ తేదీన డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పివి మార్కెట్లో విడుదల కానుంది. డాట్సన్ గో ప్లస్ కారుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

టాటా బోల్ట్

టాటా బోల్ట్

టాటా జెస్ట్ తర్వాత టాటా మోటార్స్ నుంచి రానున్న మరో సరికొత్త మోడల్ టాటా బోల్ట్. జనవరి 20, 2014వ తేదీన టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో విడుదల కానుంది. టాటా బోల్ట్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ నెల 22వ తేదీన తమ సరికొత్త కాంపాక్ట్ లగ్జరీ సెడాన్ 'సిఎల్ఏ'ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది భారత్‌లో కెల్లా అత్యంత సరసమైన ధరకే లభ్యం కానున్న మెర్సిడెస్ సెడాన్ కానుంది. ఇదొక ఫ్రంట్ వీల్ డ్రైవ్ కారు. మెర్సిడెస్ జిఎల్ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీలోని ఇంజన్లనే ఇందులోను ఉపయోగించనున్నారు. ఇది నేరుగా ఆడి ఏ3 సెడాన్‌కు పోటీగా నిలువనుంది.

ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్

ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్

ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్‌కి చెందిన పెర్ఫామెన్స్ కార్ డివిజన్ అబార్త్ (Abarth) ఈ ఏడాది జనవరి నెలలో తమ కొత్త '595 కాంపిటీషన్' లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఫియట్ అబార్త్ 595 కాంపిటీషన్ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
In this article we'll talk about the cars launching in the first month of 2015.
Story first published: Monday, January 5, 2015, 11:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X