రాష్ట్ర మార్కెట్లో 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ విడుదల

By Ravi

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈనెల 25న భారత మార్కెట్లో విడుదల చేసిన అప్‌గ్రేడెడ్ 2013 ఈ-క్లాస్ లగ్జరీ సెడాన్‌ను తాజాగా రాష్ట్ర మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఈఓ ఎబర్‌హార్డ్ హెచ్ కెర్న్ గురువారం కొత్త ఈ-క్లాస్ కారును హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాష్ట్ర మార్కెట్లో 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ధరలు ఇలా ఉన్నాయి:

  • మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ200 సిజిఐ - రూ.42.23 లక్షలు
  • మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ ఈ250 సిడిఐ - రూ.45.27 లక్షలు
  • ఈ250 సిడిఐ లాంచ్ ఎడిషన్ (100 యూనిట్లు మాత్రమే) - రూ.50.78 లక్షలు

(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్
2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్

భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తాము సరికొత్త కార్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని ఎబర్‌హార్డ్ హెచ్ కెర్న్ తెలిపారు. గడచిన సంవత్సరంలో భారత మార్కెట్లో 31,000 లగ్జరీ కార్లను విక్రయించామని, ప్రస్తుత సంవత్సరంలో ఇంతకన్నా ఎక్కువ అమ్మకాలు నమోదవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పూనేలో ఉన్న చాకన్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 10,000 యూనిట్లుగా ఉండగా, దీని అధనంగా మరో రూ.250 కోట్లను వెచ్చించి ఈ సంఖ్యను 20,000 లకు పెంచనున్నట్లు ఆయన చెప్పారు.

ఇక కొత్త 2013 మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ విషయానికి వస్తే, యాక్టివ్ పార్క్ అసిస్ట్, ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్, ఈకో స్టార్ట్-స్టాప్, అటెన్షన్ అసిస్ట్, 8 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్)తో కూడిన బ్రేక్ అసిస్ట్, ప్రీ సేఫ్ మరియు యాక్టివ్ బానెట్ వంటి సురక్షితమైన ఫీచర్లను అలాగే కొత్త పానరోమిక్ సన్‌రూఫ్, నాపా లెథర్ అప్‌హోలెస్ట్రీ, 3 యాంబీంట్ లైటింగ్ ఎఫెక్ట్స్, డ్యాష్‌బోర్డుపై ఓపెన్ పోర్ యాష్ ఉడ్ ఇంటీరియర్స్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లను ఇందులో జోడించారు.

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ200 సిజిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ250 సిడిఐ వేరియంట్లో ఉపయోగించిన 2.1 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 204 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 80 లీటర్లు. పెట్రోల్ వేరియంట్ 13.75 కెఎమ్‌పిల్ మైలేజీని, డీజిల్ వేరియంట్ 17.25 కెఎమ్‌పిల్ మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
German luxury carmaker Mercedes-Benz has launched new 2013 E-Class launched in Hyderabad with the starting price of Rs. 42.23 lakh (Ex-Showroom, Delhi) for the petrol version.
Story first published: Saturday, June 29, 2013, 13:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X