కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ విడుదల; ధర రూ.7.22 లక్షలు

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఇదివరకటి ర్యాపిడ్ సెడాన్ బేసిక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయకుండా, కాస్మోటిక్ అండ్ మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో కొత్త ర్యాపిడ్‌ను తీర్చిదిద్దారు.

భారత మార్కెట్లో ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ ప్రారంభ ధర రూ.7.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్‌లో ప్రధానంగా ఇంజన్‌లో మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త ర్యాపిడ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇదే ఇంజన్‌ను ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో ఉపయోగిస్తున్నారు.

కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..!

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

తర్వాతి స్లైడ్‌లలో కొత్త స్కొడా ర్యాపిడ్ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను పరిశీలించండి.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్ ఆప్షనల్ బ్లాక్ ప్యాకేజ్‌తో లభిస్తుంది. ఇందులో భాగంగా, బ్లాక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్, బ్లాక్ గ్రిల్ అండ్ లోగో, బ్లాక్ వింగ్ మిర్రర్స్, బ్లాక్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, బ్లాక్ గ్లాసీ రూఫ్ మరియు బ్లాక్ సైడ్ ఫోయిల్స్‌లు యాక్ససరీలుగా లభిస్తాయి. ఇవే ఇందులో ప్రధానమైన కాస్మోటిక్ అప్‌‍గ్రేడ్స్.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

ఇక మెకానికల్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే.. కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్ డీజిల్ వెర్షన్‌లో ఇదవరకటి 1.6 లీటర్ ఇంజన్‌కు బదులుగా కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో ఉపయోగిస్తున్న 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

కొత్త 2014 స్కొడా ర్యాపిడ్‌లోని ఈ 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ డీజిల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 21.14 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ డీజిల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 21.14 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డిటేల్స్

7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డిటేల్స్

కొత్త స్కొడా ర్యాపిడ్ డీజిల్ వెర్షన్‌లో 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌‌ను ఉపయోగించారు. ఇందులో రెండు క్లచ్‌లు ఉంటాయి. వాటిలో మొదటి క్లచ్ బేసి సంఖ్యలోని గేర్లను (1వ, 3వ, 5వ, 7వ గేర్లను) హ్యాండిల్ చేయగా, రెండవ క్లచ్ సరి సంఖ్యలోని గేర్లను (2వ, 4వ, 6వ గేర్లను) మరియు రివర్స్ గేర్‌ను హ్యాండిల్ చేస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పోల్చుకుంటే ఈ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లో పవర్ మరియు పవర్ డెలివరీ మధ్య అంతరాయం లేకుండా ఉండి, డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ స్మూత్‌గా అనిపిస్తుంది.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

పెట్రోల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్‌లో 1.6 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 5250 ఆర్‌పిఎమ్ వద్ద 105 పిఎస్‌ల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ పెట్రోల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ పెట్రోల్ వెర్షన్ స్కొడా ర్యాపిడ్ లీటరుకు 14.3 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

కొత్త స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో కొత్తగా ఆఫర్ చేసిన ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు కార్డ్ హోల్డర్‌లను ఆఫర్ చేస్తున్నారు.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

రిఫ్రెష్డ్ స్కొడా ర్యాపిడ్ ఈ సెగ్మెంట్లోని హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు త్వరలో మార్కెట్లో విడుదల కానున్న మారుతి సుజుకి సియాజ్ వంటి మిడ్-సైజ్ సెడాన్లకు పోటీగా నిలువనుంది.

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

పెట్రోల్ వెర్షన్ 2014 స్కొడ ర్యాపిడ్ ధరలు

* యాక్టివ్ - రూ.7.22 లక్షలు

* యాంబిషన్ ప్లస్ - రూ.8.17 లక్షలు

* యాంబిషన్ ప్లస్ ఆటోమేటిక్ - రూ.9.14 లక్షలు

* ఎలిగాన్స్ - రూ.8.72 లక్షలు

* ఎలిగాన్స్ ఆటోమేటిక్ - రూ.9.68 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

2014 స్కొడా ర్యాపిడ్ విడుదల

డీజిల్ వెర్షన్ 2014 స్కొడ ర్యాపిడ్ ధరలు

* యాక్టివ్ - రూ.8.38 లక్షలు

* యాంబిషన్ ప్లస్ - రూ.9.24 లక్షలు

* యాంబిషన్ ప్లస్ ఆటోమేటిక్ - రూ.10.34 లక్షలు

* ఎలిగాన్స్ - రూ.9.74 లక్షలు

* ఎలిగాన్స్ ఆటోమేటిక్ - రూ.10.84 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Check-republic carmaker Skoda has launched the new 2014 Rapid in India at Rs 7.22 lakh, ex-showroom Delhi. The new Rapid gets some cosmotic and mechanical updates.
Story first published: Thursday, September 25, 2014, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X