విజన్ సి కాన్సెప్ట్ ఆధారంగా సరికొత్త స్కొడా సూపర్బ్

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇటీవలే అప్‌గ్రేడెడ్ సూపర్బ్ సెడాన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్ సూపర్బ్ కాకుండా, సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన కొత్త సూపర్బ్‌ను కంపెనీ 2016లో విడుదల చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.

కొత్త స్కొడా సూపర్బ్ కోసం కంపెనీ ఇటీవలే ముగిసిన 2014 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించిన విజన్ సి కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కొడా విజన్ సి ఫోర్ డోర కూపే కాన్సెప్ట్ కారును 2014 ఆక్టావియాను తయారు చేసిన ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నారు.


విజన్ సి కాన్సెప్ట్ క్లియర్ అండ్ షార్ప్ క్యారెక్టర్ లైన్స్, స్లోపింగ్, షార్ప్ ఎడ్జెడ్ రియర్ ఫ్లాంక్, ట్రయాంగ్లర్ షేప్డ్ హెడ్‌ల్యాంప్స్ మరియు యాంగ్యులర్ టెయిల్‌ల్యాంప్స్‌ను కలిగి ఉంటుంది. కొత్త స్కొడా సూపర్బ్ కోసం పూర్తిగా విభిన్నమైన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడానికి బదులుగా ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న పాపులక్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌నే ఉపయోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
Skoda Vision C

విశాలమైన క్యాబిన్ స్పేస్, విలాసవంతమైన ఇంటీరియర్స్, హై క్వాలిటీ మెటీరియల్స్‌తో రూపుదిద్దుకోనుంది. అయితే, ఇంజన్స్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే 2016 సూపర్బ్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్‌ను మరింత ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా అప్‌ట్యూన్ చేసే అవకాశం ఉంది.
Most Read Articles

English summary
Skoda recently released the Superb facelift which gets the automaker's new face. However, an all new Superb is due for launch in 2016 if recent rumors are to be believed and will be based on the Vision C Concept that was on display at the Geneva Motor Show 2014.
Story first published: Friday, March 14, 2014, 14:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X