కొత్త ఫోక్స్‌వ్యాగన్ వెంటో విడుదల; ధర రూ.7.44 లక్షలు

By Ravi

జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెంటో సెడాన్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. మునుపటి వెర్షన్ వెంటో కన్నా మరింత మెరుగ్గా ఉండేలా కొత్త 2014 వెంటోను తీర్చిదిద్దారు. పవర్, పెర్ఫార్మెన్స్ మరియు మైలేజ్ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త వెంటోను మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో ఆఫర్ చేస్తున్నారు.

ఇందులో మొదటిది పవర్‌ఫుల్ 1.6 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.2 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు మూడవది 1.5 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్. కొత్త వెంటోలో కొత్త విషయం ఏంటంటే, డీజిల్ వెర్షన్ వెంటో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దేశీయ విపణిలో కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో ప్రారంభ ధర రూ.7.44 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డీజిల్ వెర్షన్ వెంటో 1.5 లీటర్ టిడిఐ కంఫర్ట్‌లైన్, 1.5 లీటర్ టిడిఐ హైలైన్ వేరియంట్లు మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌‍తో లభిస్తాయి. ఇందులో 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. కొత్త ఫోక్స్‌వ్యాగన్ వెంటో సెడాన్‌లోని మార్పులు, వేరియంట్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

కొత్త ఫోక్స్‌వ్యాగన్ వెంటోలో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో కొన్ని అధనపు ఫీచర్లను కూడా ఆఫర్ చేస్తున్నారు. అవేంటో తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

కోత్త ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఫ్రంట్ డిజైన్‌ను పూర్తిగా రీడిజైన్ చేశారు. రీప్రొఫైల్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్, సరికొత్త అల్లాయ్ వీల్స్, రీస్టయిల్ చేయబడిన రియర్ టెయిల్ ల్యాంప్స్ అండ్ బంపర్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

ఇంటీరియర్స్

ఇంటీరియర్స్

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్ వీల్‌పై పియానో బ్లాక్ ఫినిష్‌తో కూడిన ఆడియో అండ్ టెలిఫోన్ కంట్రోల్స్, డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, సిల్వర్ ఫినిష్డ్ సెంటర్ కన్సోల్ వంటి మార్పులు ఉన్నాయి.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

అన్ని వేరియంట్లలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇంకా.. డ్యూయెల్ బీమ్ హెడ్‌ల్యాంప్స్, అప్‌గ్రేడెడ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్, ఫుట్‌వెల్ లైట్స్, ఫ్లాట్ బాటమ్డ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి మార్పులు కూడా కొత్త వెంటోలో ప్రధానంగా చెప్పుకోవచ్చు.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఫోక్స్‌వ్యాగన్ వెంటోలోని 1.2 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 175 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 16.93 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఫోక్స్‌వ్యాగన్ వెంటోలోని 1.6 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 153 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 15.04 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఫోక్స్‌వ్యాగన్ వెంటోలోని 1.5 లీటర్ టిడిఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 103 హార్స్‌పవర్‌ల శక్తిని, 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 21.21 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

భారత్‌లో అధునాతన, రీఫైన్డ్ డీజిల్ ఆటోమేటిక్ కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ కొత్త వెంటో 1.5 లీటర్ టిడిఐ డీజిల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇందులో 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగిస్తున్నారు.

7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డిటేల్స్

7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డిటేల్స్

కొత్త వెంటో డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌‌లో రెండు క్లచ్‌లు ఉంటాయి. ఇందులో మొదటి క్లచ్ బేసి సంఖ్యలోని గేర్లను (1వ, 3వ, 5వ, 7వ గేర్లను) హ్యాండిల్ చేయగా, రెండవ క్లచ్ సరి సంఖ్యలోని గేర్లను (2వ, 4వ, 6వ గేర్లను) మరియు రివర్స్ గేర్‌ను హ్యాండిల్ చేస్తుంది. దీని ఫలితంగా సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పోల్చుకుంటే ఈ 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లో పవర్ మరియు పవర్ డెలివరీ మధ్య అంతరాయం లేకుండా ఉండి, డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ స్మూత్‌గా అనిపిస్తుంది.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కేవలం 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ వెంటోలోనే కాకుండా 1.2 లీటర్ పెట్రోల్ వెర్షన్‌లో కూడా లభిస్తుంది. ఇకపోతే 1.6 లీటర్ పెట్రోల్ వెర్షన్ వెంటోలో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2014 పోలో హ్యాచ్‌బ్యాక్‌లో ఉండే చాలా వరకు డిజైన్ ఫీచర్లను కొత్త వెంటోలో కూడా గమనించవచ్చు.

2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో

కొత్త 2014 ఫోక్స్‌వ్యాగన్ వెంటో టోఫీ బ్రౌన్ మరియు నైట్ బ్లూ కలర్లలో లభిస్తుంది. సెప్టెంబర్ 24, 2014వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ ఇండియా షోరూమ్‌లలో కొత్త వెంటో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Volkswagen India has launched the new Vento. To suit a wide range of requirements and driving preference, the new Vento is available with a range of four-cylinder engines - 1.6 MPI, 1.2 TSI and 1.5 TDI powerplants, all of which offer an excellent blend of power, performance and fuel economy.
Story first published: Wednesday, September 24, 2014, 17:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X