సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ; డీజిల్ ఇంజన్ ఆప్షన్ లభ్యం

హోండా సిటీ కార్ ప్రియులకు శుభవార్త.. మీ ప్రియమైన సిటీ కారు ఇకపై డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. జపాన్ ఆటో దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నేడు (నవంబర్ 25, 2013) తమ నాల్గవ తరం (ఫోర్త్ జనరేషన్) '2014 హోండా సిటీ' కారును భారత మార్కెట్లో ఆవిష్కరించింది.

హోండా సిటీని తొలిసారిగా 1996లో విడుదల చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22 లక్షల యూనిట్లకు పైగా సిటీ కార్లు అమ్ముడుపోయాయి. హోండా కార్స్ ఇండియా తమ తర్వాతి సిటీ సెడాన్ బేసిక్ డిజైన్‌ను దాదాపు యాధావిధిగానే ఉంచినప్పటికీ, ఈ కొత్త కారులో అనేక కాస్మోటిక్ మార్పులు చేర్పులను చేసింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2014 హోండా సిటీ 1.5 లీటర్ ఐవిటెక్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, 1.5 లీటర్ ఐడిటెక్ డీజిల్ ఇంజన్‌తో కూడా లభ్యం కానుంది. సిటీ సెడాన్‌లో డీజిల్ వెర్షన్‌‌ను ప్రవేశపెట్టడం ఇదే మొట్టమొదటిసారి. కొత్త హోండా సిటీ సెడాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

కొత్త 2014 హోండా సిటీ ఇదివరకటి సిటీ పొడవునే (4440 మి.మీ) కలిగి ఉంటుంది. అయితే, వీల్‍‌బేస్‌ను మాచ్కం 50 మి.మీ. పెంచారు (2600 మి.మీ.). దీని వెడల్పులో కూడా ఎలాంటి మార్పు లేదు. కానీ, షోల్డర్ రూమ్‌ను 40 మి.మీ. హెడ్‌రూమ్‌ను 10 మి.మీ. పెంచారు.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

నెక్స్ట్ జనరేషన్ జాజ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కొత్త సిటీ సెడాన్‌ను తయారు చేశారు. ఇది మునుపటి వెర్షన్ సిటీ సెడాన్స్ కన్నా మరిన్ని ప్రీమియం ఫీచర్లను, సరికొత్త స్టయిలింగ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

కొత్త 2014 హోండా సిటీలో 5-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది బ్లూటూత్, ఆక్స్-ఇన్, ఐపాడ్, యూఎస్‌బి బ్లూటూత్ కనెక్టివిటీలను కలిగి ఉంటుంది. ఈ కారులో ఎనిమిది స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో వన్ పుష్ స్మార్ట్ కీ ఎంట్రీ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, షార్క్ ఫిన్ యాంటినా, టచ్ ప్యానెల్ ఆటో ఏసి ఫీచర్లు ఉన్నాయి.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

కొత్త హోండా సిటీలో వెనుక వైపు ఎయిర్‌కాన్ వెంట్స్, ఫోర్ పవర్ అవుట్‌లెట్స్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను జోడించారు. అలాగే, వెనుక వైపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, ముందు వైపు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కొత్త పెద్ద క్రోమ్ గ్రిల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

కాగా.. ఈ కొత్త 2014 హోండా సిటీ సెడాన్ జనవరి 2014 నుంచి వాణిజ్య పరంగా అందుబాటులోకి రానుంది. అయితే, కొత్త సిటీ కోసం ఇప్పటికే డీలర్లు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

సరికొత్త హోండా సిటీ ఆవిష్కరణ

కొత్త హోండా సిటీ కారు ధర మరియు ఇతర వివరాలను జనవరిలో విడుదల చేసినప్పుడు వెల్లడించనున్నారు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Japanese auto major Honda Cars India has unveiled its fourth-generation Honda City sedan In New Delhi on Monday. Along with the new design new City also gets lots of smart features and technical upgrades. The new City will be available in India from January 2014.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X