రాత్రివేళల్లో స్వయంగా ప్రకాశించే కార్ పెయింట్!

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ తమ కార్లకు ఓ సరికొత్త పెయింట్ టెక్నాలజీని ఉపయోగించనుంది. గతంలో మనం అమెరికాలో ప్రకాశించే రోడ్ల గురించి తెలుసుకున్నాం గుర్తుందా..? పగలంతా సూర్యకాంతిని గ్రహించి, రాత్రివేళల్లో రోడ్లు ఎలా ప్రకాశిస్తాయో.. అలాగే పగలంతా సూర్యకాంతిని గ్రహించి రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్‌ను నిస్సాన్ పరిచయం చేసింది.

ఈ తరహా గ్లో ఇన్ ది డార్క్ కార్ పెయింట్‌ను ఉపయోగించిన మొట్టమొదటి కంపెనీ కూడా నిస్సాన్ కావటం మరో విశేషం. నిస్సాన్ అందిస్తున్న లీఫ్ ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ ఈ పెయింట్ టెక్నాలజీని వియజవంతంగా పరీక్షించింది. స్టార్‌ప్యాచ్ అనే పెయింట్ టెక్నాలజీని కనుగొన్న హామిష్ స్కాట్‌తో చేతులు కలిపి నిస్సాన్ ఈ పెయింట్‌ను అభివృద్ధి చేసింది.

నిస్సాన్ గ్లో ఇన్ ది డార్క్ పెయింట్ గురించి మరింత సమాచారాన్ని తర్వాతి సెక్షన్‌లో తెలుసుకోండి..!

రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్!

ఇదొక స్ప్రే పెయింట్. ఈ పెయింట్ పగటి వేళల్లో సూర్యకాంతిని గ్రహించి, రాత్రిపూట 8-10 గంటల సమయం పాటు ప్రకాశిస్తు ఉంటుంది.

రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్!

వాస్తవానికి గ్లోయింగ్ కార్ పెయింట్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ, నిస్సాన్ లీఫ్ కారు కోసం ఉపయోగించిన పెయింట్‌ను పూర్తిగా ఆర్గానిక్ మెటీరియల్స్‌తో తయారు చేశారు.

రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్!

గ్లో ఇన్ ది డార్క్ పెయింట్ కారణంగా, చిమ్మచీకటిగా ఉన్న రోడ్డుపై సైతం కారును సులువుగా గుర్తించడం సాధ్యమవుతుంది. కారు గమనంలో ఉన్నా లేకపోయినా అది ప్రకాశిస్తూ ఉండి, ఇతర వాహనాలకు కనిపించే విధంగా ఉంటుంది.

రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్!

నిస్సాన్ ఆఫర్ చేయనున్న ఈ విశిష్టమైన పెయింట్‌ను ఒక్కసారి కారుపై పెయింట్ చేస్తే, దాదాపు 25 ఏళ్ల వరకూ లైఫ్ వస్తుందని కంపెనీ చెబుతోంది.

రాత్రివేళల్లో ప్రకాశించే కార్ పెయింట్!

ఈ గ్లో ఇన్ ది డార్క్ పెయింట్ వలన రోడ్ సేఫ్టీ పెరగడమే కాకుండా.. ఈ కారును ఇంటి లాన్‌లో ప్రత్యామ్నాయ లైట్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

వీడియో

నిస్సాన్ ఆఫర్ చేయనున్న గ్లో ఇన్ ది డార్క్ పెయింట్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మీరే ఈ వీడియోలో చూడండి.

Most Read Articles

English summary
Japanese automobile giant, Nissan is the first manufacturer to use glow in the dark paint on their vehicles. They have adopted this new paint scheme for their efficient electric vehicle the Leaf. Nissan has not confirmed if this paint will be offered to customers or not.
Story first published: Thursday, February 12, 2015, 12:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X