సెల్ఫ్ క్లీనింగ్ కారును అభివృద్ధి చేసిన నిస్సాన్

By Ravi

చాలా మంది కార్ ప్రియులకు తమ కారును శుభ్రంగా ఉంచుకోవటం ఇష్టం. ఇలాంటి వారు తమ కారుపై దుమ్ము పడకుండా చూసుకుంటుంటారు. ఎంతో కష్టపడి కార్ వాష్ చేసుకుంటుంటారు. అంత నీట్‌గా ఉండే కారుపై ఏదైనా పిట్ట రెట్ట వేసినా లేదా కుటుంబ సభ్యులో లేక స్నేహితులో కారును తీసుకెళ్లి తిరిగి మట్టి మరకలతో తెచ్చిచ్చినా వారి ముఖంలో కాంతి వెలసిపోతుంటుంది.

మళ్లీ కష్టపడి కారును పాలిష్ చేసుకోవాలా అని చింతిస్తుంటారు. అలాంటి వారి కోసమే నిస్సాన్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే 'సెల్ఫ్-క్లీనింగ్ కార్' టెక్నాలజీ. అవును, పేరుకు తగినట్లు గానే ఈ టెక్నాలజీ కలిగిన కార్లను మన క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. దానంతట అదే క్లీన్‌గా ఉంటుంది. ఆ టెక్నాలజీ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం రండి.

Nissan Note Paint

ఈ టెక్నాలజీ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, ఇదొక విశిష్టమైన బాడీ పెయింట్. సరికత్త నానో పెయింట్ టెక్నాలజీని కార్లకు అప్లయ్ చేస్తే, కార్లపై పడే దుమ్ము, ధూళి, బురద, నీళ్లు ఇవన్నీ కూడా తామరాకుపై పడిన నీటి బొట్టు మాదిరిగా సర్రుమని జారిపోతాయి. ఈ కొత్త మెటీరియల్ సూపర్-హైడ్రోఫోబిక్ మరియు ఓలియోఫోబిక్ పెయింట్‌ను ఉపయోగించుకుంటుంది.

నిస్సాన్ తమ కొత్త నోట్ హ్యాచ్‌బ్యాక్ కారుపై అర్థం భాగం ఈ నానో టెక్నాలజీ పెయింట్‌ను మరో అర్ధ భాగంపై రెగ్యులర్ పెయింట్‌ను అప్లయ్ చేసింది. ఆ తర్వాత కారును దుమ్ము, ధూళి, మట్టి, బురద రోడ్లపై డ్రైవ్ చేసింది. ఆ తర్వాత పరిశీలిస్తే, రెగ్యులర్ పెయింట్ వేసిన అర్ధ భాగం మాత్రం మరకలతో, దుమ్ముతో నిండిపోయింది. నానో టెక్నాలజీ పెయింట్ వేసిన అర్థ భాగం మాత్రం క్లీన్‌గా ఉంది. ఆ డెమో వీడియోని మీరు కూడా వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/UwoGsCAKsxU" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Nissan has used this new paint on their Note model, thus creating the first self-cleaning car in the world. The Japanese automobile manufacturer has provided a demo in the video below.&#13;
Story first published: Friday, April 25, 2014, 11:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X