ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న 'నిస్సాన్ ఈ-ఎన్‌వి200' (ఇవాలియా)

By Ravi

గడచిన 2012లో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్, గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న 'ఎన్‌వి200' (మన మార్కెట్లో ఇవాలియా పేరుతో లభిస్తోంది) ఎమ్‌పివిలో ఓ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఉత్పత్తి దశకు చేరుకుంది.

ఉత్పత్తికి సిద్ధంగా నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివి మార్చ్ నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించనుంది. నిస్సాన్ తమ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ ఫెడెక్స్‌, ప్రముఖ బెవెరేజెస్ కెంపనీ కోకకోలాలతో కలిసి నిస్సాన్ టెస్టింగ్ నిర్వహించింది.

నిస్సాన్ తమ ఈ-ఎన్‌వి200 ఆల్-ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో ఒక ప్యాసింజర్ వెర్షన్‌ను మరొక కమర్షియల్ వెర్షన్‌ను రూపొందించింది. వచ్చే మే నెల నుంచి అందుబాటులోకి రానుంది. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200

అవార్డ్ విన్నింగ్, వరల్డ్స్ బెస్ట్ ఎలక్ట్రిక్ కారుగా పేరు గాంచిన నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారులోని డ్రైవ్‌ట్రైన్ (ఇంజన్/మోటార్)నే నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలోను ఉపయోగించనున్నారు. కాబట్టి దీని పెర్ఫార్మెన్స్ లీఫ్‌తో సమానంగా ఉన్నప్పటికీ, ఇందులో విశాలమైన క్యాబిన్ స్పేస్ మరో అదనపు అడ్వాంటేజ్‌గా నిలుస్తుంది.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200

నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలోని ఎలక్ట్రిక్ మోటార్ 24 కివాట్ బ్యాటరీ ప్యాక్‌తో నడుస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 107 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200

నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫర్ చేసే రేంజ్ (మైలేజ్)నే నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివి కూడా ఆఫర్ చేయనుంది. ఇది సుమారు 130 కిలోమీటర్లుగా ఉంటుంది.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలోని బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లో 80 శాతం చార్జ్ అవుతాయి.

నిస్సాన్ ఈ-ఎన్‌వి200

ప్యాసింజర్ వెర్షన్ నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలో ఒక బ్యాటరీ, ఒక మోటార్ ఉంటాయి. అలాగే, గరిష్ట పేలోడ్‌ను దృష్టిలో ఉంచుకొని కార్గో వెర్షన్ నిస్సాన్ ఈ-ఎన్‌వి200 ఎమ్‌పివిలో అదనపు బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
At next month's Geneva Motor Show Nissan will launch the production version of the NV200 (Evalia). Dubbed the e-NV200, the electric van was first showcased as a concept at the 2012 Detroit Motor Show.
Story first published: Wednesday, February 26, 2014, 16:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X